HomeUncategorizedHastag War | హ్యాష్ ట్యాగ్స్ కోసం ఎన్టీఆర్, హృతిక్‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం.. సోష‌ల్...

Hastag War | హ్యాష్ ట్యాగ్స్ కోసం ఎన్టీఆర్, హృతిక్‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం.. సోష‌ల్ మీడియాలో ఇదే ట్రెండింగ్

- Advertisement -

Hastag War | ఇద్ద‌రు స్టార్ హీరోలు క‌లిసి బాక్సాఫీస్‌ని షేక్ చేసేందుకు వార్ 2 అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. ఒకరు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr. NTR) కాగా , మరొకరు బాలీవుడ్ గ్రీకు గాడ్ హృతిక్ రోషన్ (Hrithik Roshan). ఇద్దరూ కలిసి స్క్రీన్‌పై తలపడే స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ (War 2)కోసం అభిమానులు కౌంట్‌డౌన్ మొదలెట్టేశారు. ఆగస్ట్ 14న ఈ భారీ చిత్రం థియేటర్లలో సందడి చేయనుండగా, చిత్రబృందం ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ vs హృతిక్ సోషల్ మీడియా వార్‌తో హంగామా మొదలైంది.

Hastag War | ఇంట్రెస్టింగ్ ఫైట్..

తాజాగా #NTRvsHrithik, #HrithikvsNTR అనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇద్ద‌రు హీరోలు కూడా ఫన్నీగా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ ఫైట్ చేశారు. ఎక్స్ లో ఈ ఇద్ద‌రు హీరోల మధ్య హ్యాష్‌ట్యాగ్ యుద్ధం ప్రేక్షకుల్ని మరింత ఉత్కంఠకు గురి చేస్తుంది. హృతిక్ రోషన్ తన ట్విట్టర్‌లో ‘మళ్లీ యుద్ధ రేఖలు గీయ‌బ‌డ్డాయి. హ్యాష్‌ ట్యాగ్ అన్ని చెబుతోంది! ప్రతి అప్‌ డేట్, ప్రతి సీక్రెట్ కోసం #HrithikvsNTR హ్యాష్‌ ట్యాగ్‌ ను ఫాలో అవ్వండి. ఇక్కడ నుంచే యాక్షన్ మొదలవుతోంది!” అంటూ ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేస్తూ హృతిక్ ఓ పోస్ట్ పెట్టాడు. దీనికి ఎన్టీఆర్ NTR స్పందిస్తూ..“హే హృతిక్ సర్… మనం ఈ విషయాన్ని చర్చించాం. ఫాలో అవ్వాల్సిన హ్యాష్ ట్యాగ్ ఒక్కటే… #NTRvsHrithik! యుద్ధం ఇప్పుడు మొదలవుతోంది.. రెడీగా ఉండండి” అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు.

దానికి హృతిక్ స్పందిస్తూ.. “హాహా, బాగుంది తారక్! కానీ హ్యాష్‌ట్యాగ్ #HrithikvsNTR. కాంప్లికేట్ చేయొద్దు ?” అని ఫన్నీ ఎమోజీతో ట్వీట్ చేశాడు. దానికి ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘హృతిక్ సర్, #NTRvsHrithik అనే హ్యాష్‌ట్యాగ్ చాలా బాగుంది. ఇప్పుడే నేను విజ‌య్ సాధించా అనుకుందాం!” అంటూ పోస్ట్ పెట్టాడు. మొత్తానికి ఇద్దరి మధ్య హ్యాష్‌ ట్యాగ్ ఫైట్(Hashtag Fight) ఓ రేంజ్‌లో సాగింది. సినిమాలో కంటే ముందు సోషల్ మీడియాలో వార్ మొదలైపోయింది అంటూ ఫన్నీగా నెటిజ‌న్స్ కామెంట్లు చేస్తున్నారు.కాగా, ‘వార్ 2’ ఎన్టీఆర్‌కు బాలీవుడ్‌లో తొలి చిత్రం. తొలి సినిమానే హృతిక్‌తో పోటీలో అంటే ఎక్స్‌పీక్టేష‌న్స్ పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్లు, గ్లింప్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి.. సిక్స్ ప్యాక్ బాడీతో ఎన్టీఆర్ ఆకట్టుకోగా, హృతిక్ స్టైలిష లుక్‌లో చిచ్చు రేపుతున్నాడు. ఈ సినిమా 2019లో విడుదలైన వార్‌ సీక్వెల్. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో ఇది 6వ సినిమా. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.