అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jr. NTR | ఒక చిన్న చిత్రంగా ప్రారంభమై, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా ‘కాంతార’. ఈ సినిమా రిషబ్ శెట్టికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు(National Award) సొంతం చేసుకున్న రిషబ్, ఇప్పుడు ఈ సిరీస్ విస్తరిస్తున్నాడు. ‘కాంతారకు ప్రీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘కాంతార: ఛాప్టర్ 1’ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. హోంబలే ఫిల్మ్స్ నిర్మాణం(Produced by Hombale Films)లో వస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2025, అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ‘కాంతార’ బడ్జెట్: రూ.14 కోట్లు కాగా, ఈ సినిమా హిట్ కావడంతో ‘కాంతార ఛాప్టర్ 1’ బడ్జెట్: రూ.125 కోట్లు చేశాడు. అంటే ఈసారి సినిమాని ఎలాంటి స్థాయిలో తెరకెక్కించారో అర్థమవుతోంది.
Jr. NTR | ఎన్టీఆర్ ఎంట్రీ..
ఇప్పుడు సిరీస్‌లో హైప్ పెంచుతున్న వార్తేంటంటే.. ‘కాంతార 3’ సినిమా(Kantara 3 Movie)లో ఓ తెలుగు స్టార్ హీరో కీలక పాత్ర పోషించనున్నారని టాక్. మరి ఆ హీరో మరెవరో కాదు, జూనియర్ ఎన్టీఆర్ అన్నది ఇండస్ట్రీలో హాట్ బజ్. రిషబ్ శెట్టితో తారక్‌కి మంచి స్నేహం ఉంది. ఇటీవల ఎన్టీఆర్ కర్ణాటక వెళ్లినప్పుడు, రిషబ్ శెట్టి(Rishab Shetty), ప్రశాంత్ నీల్(Prashant Neel)లతో గడిపిన సమయం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ సమయంలో ఇంటి వద్దే రిషబ్ కథ వినిపించాడని, 15 నిమిషాల స్క్రీన్ టైమ్ ఉన్న ఒక పవర్ఫుల్ క్యారెక్టర్‌కి ఎన్టీఆర్(Jr. NTR) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ వార్త అధికారికంగా వెల్లడికాకపోయినా, బళ్లారిలో ఎన్టీఆర్ క్రేజ్ దృష్టిలో ఉంచుకుంటే, ఇది పెద్ద మైలురాయిగా మారే అవకాశం ఉంది.
‘కాంతార’ సినిమాతో రూ.4 కోట్లు రెమ్యూనరేషన్ పొందిన రిషబ్ , ఇప్పుడు ‘కాంతార 1 & 3’ కింద రూ.100 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.‘కాంతార: ఛాప్టర్ 1’లో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, కీలక పాత్రలో జయరామ్ కనిపించనున్నాడు.‘కాంతార’లో నటించిన సప్తమి గౌడ మాత్రం ఈ పార్ట్‌లో ఉండటం లేదు. ప్రస్తుతం రిషబ్ శెట్టి, తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’ చిత్రంలో హనుమంతుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం 2026లో విడుదల కానుంది. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో మరో తెలుగు ప్రాజెక్ట్‌కి కూడా సైన్ చేశాడు.అయితే ‘కాంతార 3’లో ఎన్టీఆర్ ఎంట్రీ నిజమైతే, ఈ సినిమా పై అంచనాలు పీక్స్‌కి వెళ్లడం ఖాయం.