NSUI Sandeep Challenge | సమయం ఖరారు చేసి చెప్పాలి..: ఎన్ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్

ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు అన్యాక్రాంతం అయిన విషయంపై ఎమ్మెల్యే సవాల్​కు తాము సిద్ధమని, సోమవారం కలెక్టరేట్​కు ఏ సమయానికి చర్చకు రావాలో చెప్పాలని ఎన్ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్ అన్నారు.

అక్షరటుడే, కామారెడ్డి: NSUI Sandeep Challenge | ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు అన్యాక్రాంతం అయిన విషయంపై ఎమ్మెల్యే సవాల్​కు తాము సిద్ధమని, సోమవారం కలెక్టరేట్​కు ఏ సమయానికి చర్చకు రావాలో చెప్పాలని ఎన్ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్ అన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఆదివారం ఎమ్మెల్యేకు బహిరంగ లేఖ విడుదల చేశారు. NSUI Sandeep Challenge | ఆధారాలతో నిరూపిస్తాం ప్రభుత్వ కాలేజీ భూముల్లో జరిగిన అక్రమాలపై సోమవారం కలెక్టరేట్ వద్ద ఆధారాలతో సహా […]

అక్షరటుడే, కామారెడ్డి: NSUI Sandeep Challenge | ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు అన్యాక్రాంతం అయిన విషయంపై ఎమ్మెల్యే సవాల్​కు తాము సిద్ధమని, సోమవారం కలెక్టరేట్​కు ఏ సమయానికి చర్చకు రావాలో చెప్పాలని ఎన్ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్ అన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఆదివారం ఎమ్మెల్యేకు బహిరంగ లేఖ విడుదల చేశారు.

NSUI Sandeep Challenge | ఆధారాలతో నిరూపిస్తాం

ప్రభుత్వ కాలేజీ భూముల్లో జరిగిన అక్రమాలపై సోమవారం కలెక్టరేట్ వద్ద ఆధారాలతో సహా వస్తానని ఎమ్మెల్యే తెలపడాన్ని ఎన్ఎస్​యూఐ విద్యార్థి సంఘం స్వాగతిస్తోందన్నారు. ప్రజా సమస్యలపై, విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న కాలేజీ భూముల విషయంలో తమ సంఘం ఎప్పుడూ రాజీలేని పోరాటం చేస్తూనే ఉందని తెలిపారు. ఎమ్మెల్యే విసిరిన సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని, చర్చకు రావడానికి మేము పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. కళాశాల భూముల్లో జరిగిన అక్రమాలు, భూములు ఎలా అన్యాక్రాంతమయ్యాయో ప్రతి అంశాన్ని ఆధారాలతో సహా నిరూపించడానికి తమ వద్ద సాక్ష్యాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాజకీయ లబ్ధి కోసం కాకుండా, నిజాయితీగా అక్రమాలను వెలికితీసే ఉద్దేశం ఎమ్మెల్యేకు ఉంటే మాటకు కట్టుబడి చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ​విద్యార్థుల ఆస్తులను కాపాడడంలో ఎన్​ఎస్​యూఐ ఎవరికీ భయపడదని, నిజానిజాలు ప్రజల ముందు, విద్యార్థుల ముందు తేలాల్సిందేనని స్పష్టం చేశారు.

Balla Sandeep Kumar
Balla Sandeep Kumar
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2006 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Kishtwar Encounter Operation | జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kishtwar Encounter Operation | జమ్మూ కశ్మీర్​లో ఆదివారం ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు....

Kamareddy College Land Dispute | ముదురుతున్న కళాశాల ఆస్తుల వివాదం.. ఎమ్మెల్యే రాజీనామాస్త్రం

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Govt Degree College) ఆస్తుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత పదేళ్లుగా ఈ అంశం రాజకీయ ఆరోపణలకు అస్త్రంగా మారుతూనే ఉంది.

Vemula Prashanth Reddy Protest | రైతుల కోసం పోరాడితే అక్రమ కేసులా : మాజీ మంత్రి వేముల

​అక్షరటుడే, భీమ్​గల్ : Vemula Prashanth Reddy Protest | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే...

Revanth Reddy Projects Completion | రెండేళ్లలో పెండింగ్​ ప్రాజెక్ట్​లు పూర్తి చేస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy Projects Completion | రాష్ట్రంలో పెండింగ్​ ప్రాజెక్ట్​లను రెండేళ్లలో పూర్తి చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి  (CM Revanth...