MLA Resignation Demand | ఎమ్మెల్యేను రాజీనామా చేయించడానికే వచ్చాం: ఎన్​ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్​

ప్రభుత్వ కళాశాలకు సంబంధించి అన్ని ఆధారాలతో వచ్చామని.. ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే రాజీనామా చేయాలని ఎన్​ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్​ అన్నారు. కలెక్టరేట్​ ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు.

అక్షరటుడే, కామారెడ్డి: MLA Resignation Demand | ఎమ్మెల్యే తప్పు ఉందని ఆధారాలతో నిరూపించి రాజీనామా చేయించడానికే కలెక్టరేట్​కు వచ్చామని ఎన్ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేణి సందీప్ (Aireni Sandeep)  అన్నారు. కలెక్టర్​ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

MLA Resignation Demand | ఆధారాలతో కలెక్టర్​ వద్దకు..

ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దని, ఆధారాలు తీసుకుని కలెక్టర్ (Collector) వద్దకు వస్తే అధికారుల సమక్షంలో చర్చిద్దామని ఎమ్మెల్యే చెప్తే కలెక్టర్ వద్దకు వచ్చామని సందీప్​ పేర్కొన్నారు. అధికారుల సమక్షంలో రికార్డులు తీసి గజం భూమి తేడా వచ్చినా స్పీకర్ ఫార్మాట్​లో రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే (MLA) ప్రకటించినట్లు గుర్తు చేశారు. అన్ని డాక్యుమెంట్లు తీసుకుని వస్తే ఎందుకు వచ్చారని కలెక్టర్ అడుగుతున్నారని తెలిపారు. శనివారం కూడా శిశుమందిర్ వద్దకు రావాలని పిలుపునిచ్చినప్పుడు ఎమ్మెల్యే వస్తారని చెప్పినా.. ఏ అధికారికి సమాచారం ఇవ్వలేదని, నేడు కూడా కలెక్టరేట్​కు చర్చకు వస్తున్నట్లు సమాచారం ఇవ్వలేదన్నారు. ఇలా ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రశ్నించారు.

MLA Resignation Demand | వైబ్​సైట్​లో సమాచారం ఉంది..

ఐజీఆర్ఎఫ్ వెబ్ సైట్​ (IGRF Website​)లో కళాశాలకు సంబంధించిన 82పేజీలు అన్ని డాక్యుమెంట్స్ అందుబాటులో ఉన్నాయని గతంలో తాము చెప్పిన విషయాన్ని సందీప్​ గుర్తు చేశారు. ఎమ్మెల్యే తప్పులను ఎత్తి చూపితే ‘భౌతిక దాడులకు పూనుకుంటాం.. కుక్కలు అంటూ’ అన్ పార్లమెంటరీ పదాలు ఎందుకు వాడుతున్నారని, ఎందుకు టెన్షన్ పడుతున్నారని ప్రశ్నించారు. ఆధారాలు తెమ్మంటే తెచ్చామని, ఎమ్మెల్యే రాజీనామా చేయాలని సవాల్ చేశారు. కలెక్టర్​ను కలిస్తే విచారణ చేస్తామన్నారని చెప్పినట్లు తెలిపారు. ఈ విషయమై సీఎంను కలిసి విచారణ కమిటీ వేయిస్తామని, ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలు నిరూపించి రాజీనామా చేయిస్తామని, కామారెడ్డి (Kamareddy) పుర ప్రముఖులు, విద్యార్థి సంఘాలతో కలిసి జేఏసీ ఏర్పాటు చేసి కళాశాల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.

Related articles

Advocate Attack Case | న్యాయవాదిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

రుద్రూర్​లో న్యాయవాది కళ్యాణిపై ముష్కరుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు.

Peaceful Municipal Elections | అందరి సహకారంతో ప్రశాంతంగా ఎన్నికలు

అందరి సహకారంతో జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ మేరకు పలువురు అధికారులను సన్మానించారు.

Nizamabad Deputy Mayor | డిప్యూటీ మేయర్ బాధ్యతల స్వీకరణ

నిజామాబాద్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్​గా సల్మా తహసిన్ సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు సందర్భంగా ఆమెకు మేయర్​ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు.

Kamareddy DMHO Appointment | కామారెడ్డి డీఎంహెచ్​వోగా రవీందర్ గౌడ్

కామారెడ్డి డీఎంహెచ్​వోగా డాక్టర్ రవీందర్ గౌడ్​ నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్​మెంట్​ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.