అక్షరటుడే, ప్రగతినగర్: హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌లో ఉన్న NSR Impulse Knowledge park (జూనియర్ కాలేజీ)లో ఈ నెల 9వ తేదీన నిర్వహించిన స్కాలర్షిప్ కమ్ టాలెంట్ టెస్ట్‌లో శ్రీనిధి పాఠశాల పదో తరగతి విద్యార్థి మామిళ్ల రెడ్డి ప్రతిభ చూపి టాప్ వన్‌లో నిలిచాడు.
ఈమేరకు NSR Impulse విద్యాసంస్థల ఛైర్మన్ నలబోలు సీతారామయ్య చేతుల మీదుగా విద్యార్థి మామిళ్ల రెడ్డికి జ్ఞాపిక అందజేశారు. ![]()
23వ తేదీన మరో టాలెంట్ టెస్ట్..
ఈ సందర్భంగా NSR Impulse జూనియర్ కాలేజీ డీన్ జమిలా బేగం మాట్లాడుతూ.. టాలెంట్ టెస్ట్‌లో పాల్గొన్న విద్యార్థులందరూ చక్కని ప్రతిభ చూపారని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థి మామిళ్ల రెడ్డికి ప్రథమ బహుమతి అందజేసినట్లు పేర్కొన్నారు.
ఈ నెల (నవంబరు) 23వ తేదీన మరో స్కాలర్షిప్ కమ్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు కళాశాల డీన్ తెలిపారు. ప్రగతినగర్, నిజాంపేట్, సింహపురి కాలనీ, ఇతర సమీప కాలనీల్లోని పదో తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టాలెంట్ టెస్ట్‌లో పాల్గొని తమ ప్రతిభ చూపాలని పిలుపునిచ్చారు.![]()
23వ తేదీన ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని తెలిపారు. పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సకాలంలో తీసుకురావాలని సూచించారు.
