అక్షరటుడే, వెబ్‌డెస్క్:NRI Policy | గల్ఫ్ కార్మికుల(Gulf Workers) సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి(Former MLA Anil Eeravatri) అన్నారు. ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ సభ్యులు అనిల్ ఈరవత్రి ఆధ్వర్యంలో సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఈరవత్రి అనిల్(Eeravatri Anil) మాట్లాడుతూ.. కమిటీ ఛైర్మన్ వినోద్(Committee Chairman Vinod) ఆధ్వర్యంలో సమగ్ర ఎన్నారై పాలసీ(NRI Policy)తో కూడిన గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేస్తుందని ప్రకటించారు. సీఎంను కలిసిన వారిలో కమిటీ వైస్ ఛైర్మన్ భీమ్‌రెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాసరావు, గుగ్గిల్ల రవిగౌడ్, నంగి దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.