Homeటెక్నాలజీUPI | యూపీఐ చెల్లింపుదారుల‌కు అల‌ర్ట్‌.. కొత్త నిబంధ‌న తెచ్చిన ఎన్‌పీసీఐ

UPI | యూపీఐ చెల్లింపుదారుల‌కు అల‌ర్ట్‌.. కొత్త నిబంధ‌న తెచ్చిన ఎన్‌పీసీఐ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: UPI | న‌ల్ల‌ధ‌న నియంత్ర‌ణ‌, లావాదేవీల్లో పార‌ద‌ర్శ‌క‌త పెంచేందుకు కేంద్ర ప్ర‌భుత్వం(Union government) చేప‌ట్టిన చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాలిస్తున్నాయి. ప్ర‌భుత్వ ప్రోత్సాహంతో దేశంలో డిజిట‌ల్ లావాదేవీలు(Digital transactions) గ‌ణ‌నీయంగా పెరిగిపోయాయి.

బ్యాంకుల‌కు వెళ్లే వారి సంఖ్య త‌గ్గిపోవ‌డంతో పాటు న‌గ‌దు మార్పిడి కూడా చాలా వ‌ర‌కు ప‌డిపోయింది. దాదాపు డిజిటల్ చెల్లింపుల (Digital Payments) ప్ర‌క్రియే అంత‌టా న‌డుస్తోంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) చెల్లింపులు భారీగా పెరిగాయి. దాదాపు అంద‌రూ తమ రోజువారీ చెల్లింపులను యూపీఐ ద్వారా చేస్తున్నారు. ఈ క్ర‌మంలో కొన్నిసార్లు డబ్బు తప్పు ఖాతాకు బదిలీ అయినప్పుడు చిన్న పొరపాటు ఖరీదైనదిగా మారుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NCCI) భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చూసేందుకు కొత్త నిబంధ‌న అమలు చేయాలని నిర్ణయించింది.

UPI | ఏమిటా కొత్త రూల్?

యూపీఐ చెల్లింపుల్లో త‌ప్పులు జ‌రుగ‌కుండా ఉండేందుకు ఎన్‌పీసీఐ కొత్త రూల్(NPCI new rules) తీసుకొచ్చింది. డ‌బ్బు పంపే స‌మ‌యంలో నేరుగా బ్యాంక్ ఖాతాదారు పేరు క‌నిపించేలా చ‌ర్య‌లు చేప‌ట్టింది. కొత్త రూల్ ప్రకారం యూపీఐ(UPI) ద్వారా డబ్బు పంపినప్పుడు, అతను బ్యాంకు కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (Core Banking System)లో నమోదు చేయబడిన ఖాతా పేరును మాత్రమే చూస్తాడు. అంటే మీ ఫోన్‌లో సేవ్ చేసిన పేరు ఆధారంగా కాకుండా బ్యాంక్ వివరాల ప్రకారం అసలు పేరు క‌నిపించిన వారికి మాత్ర‌మే డ‌బ్బులు పంపిస్తార‌న్న మాట‌..!

దీనివల్ల మీరు డబ్బు పంపించే వ్యక్తి పేరు ఈజీగా తెలిసిపోతుంది. ఆ క్రమంలో మనీ పంపించే వ్యక్తి పేరును ముందుగానే నిర్ధారణ చేసుకుని పంపించుకోవచ్చు. నగదు చెల్లింపునకు ముందే పేరు కనిపించడం వల్ల తప్పు ఖాతా లేదా వ్యక్తులను డ‌బ్బు పంపించే ప్ర‌మాద‌ముండ‌దు. అయితే, దీనిని పీర్ టు పీర్ (పీ2పీ), పీర్ టు మ‌ర్చెంట్ (పీ2ఎం) లావాదేవీలకు మాత్ర‌మే ఎన్‌సీపీఐ అమలు చేస్తుంది. వినియోగదారులకు సరైన ఖాతాదారుడి గుర్తింపును చూపించడం, తద్వారా గందరగోళానికి అవకాశం లేకుండా చూడ‌డానికి ఈ కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. ఎన్‌సీపీఐ ప్రకటించిన ఈ కొత్త రూల్ జూన్ 30 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూపీఐ ప్లాట్‌ఫామ్‌లలో అమలులోకి వస్తుంది.

UPI | పొర‌పాటు జ‌రిగితే ఇలా చేయండి..

అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు చెల్లింపుల విషయంలో తప్పు జరిగే అవ‌కాశ‌ముంది. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా పొరపాటున డబ్బు పంపబడిన వ్యక్తిని సంప్రదించాలి. అతను డబ్బు తిరిగి ఇవ్వకపోతే, వెంటనే మీ సంబంధిత బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. లేదంటే ఎన్‌పీసీఐ హెల్ప్‌లైన్(NPCI Helpline) 1800-120-1740కు కాల్ చేసి లేదా వెబ్‌సైట్‌ను సందర్శించి ఫిర్యాదు చేస్తే నిర్దేశిత స‌మ‌యంలో మీ డ‌బ్బు మీకు వెన‌క్కి వ‌స్తుంది.

Must Read
Related News