ePaper
More
    HomeతెలంగాణNizamabad CP | ఇక సీపీ ఎదుటే బైండోవర్‌..

    Nizamabad CP | ఇక సీపీ ఎదుటే బైండోవర్‌..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nizamabad CP | రానున్న పండుగల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ సాయి చైతన్య (CP Sai Chaitanya) కీలక నిర్ణయం తీసుకున్నారు. పాత నేరస్థులు, కమ్యూనల్‌ కేసుల్లో ఉన్నవారు, డీజే నిర్వాహకులను బెండోవర్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే గతంలో తహశీల్దార్లు లేదా రెవెన్యూ డివిజనల్‌ అధికారి (Tahsildars or Revenue Divisional Officers) వద్ద బెండోవర్లు చేసేవారు. తాజాగా సీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లా అదనపు మెజిస్ట్రేట్‌ హోదాలో ఆయనే స్వయంగా బైండోవర్లు చేస్తున్నారు.

    బోధన్‌ సబ్‌ డివిజన్‌కు (Bodhan sub-division) సంబంధించి 13 మంది పాత నేరస్థులు, కమ్యూనల్‌ కేసుల్లో ఉన్నవారిని సీపీ బైండోవర్‌ చేశారు. వీరిలో కమ్యూనల్‌ కేసుల్లో ఉన్నవారు, అకారణంగా గొడవలకు దిగేవారు, డీజే నిర్వాహకులు ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి రూ.లక్ష సొంత పూచీకత్తుతో బెండోవర్‌ చేశారు. మిగిలిన సబ్‌ డివిజన్లకు (sub-divisions) సంబంధించిన వారిని కూడా ఇలాగే బైండోవర్‌ చేయనున్నారు.

    Nizamabad CP | శాంతి భద్రతల పరిరక్షణకు..

    శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గణేశ్‌ ఉత్సవాలు (Ganesh Utsavam), దేవీ నవరాత్రి వేడుకలు (Devi Navratri celebrations), ఇతర పండుగల దృష్ట్యా ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే పదేపదే అల్లర్లకు పాల్పడే వారు, కేసులు నమోదై ఉన్న డీజే నిర్వాహకులను అదనపు మెజిస్ట్రేట్‌ హోదాలో ఆయనే బైండోవర్లు చేస్తున్నారు. గతంలో తహశీల్దార్ల వద్ద బైండోవర్లు చేసినా.. నిందితులు తిరిగి నేరాలకు పాల్పడేవారు. బైండోవర్ల ఉల్లంఘన జరిగేది. ఈ నేపథ్యంలో కమిషనరేట్‌ అధికారాలను ఉపయోగించి ఒక్కొక్కరిని 6 నెలల పాటు బెండోవర్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా నిందితుల్లో సత్ప్రవర్తన ఏర్పడుతుందని కమిషనరేట్‌ అధికారులు భావిస్తున్నారు.

    More like this

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...

    tarpaulin covers Distribution | శిథిలావస్థకు చేరిన ఇళ్ల పరిశీలన.. బాధితులకు టార్పాలిన్​ల అందజేత

    అక్షరటుడే, కోటగిరి: tarpaulin covers Distribution | నిజామాబాద్​ జిల్లా Nizamabad district రూద్రూర్ మండల Rudrur mandal...