ePaper
More
    HomeజాతీయంBSNL Sim | ఇక ఇంటికే సిమ్​ కార్డు.. బీఎస్​ఎన్​ఎల్​ కీలక నిర్ణయం

    BSNL Sim | ఇక ఇంటికే సిమ్​ కార్డు.. బీఎస్​ఎన్​ఎల్​ కీలక నిర్ణయం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BSNL Sim | ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఇంటికే సిమ్​ కార్డులను డోర్​ డెలివరీ (Sim Door Delivery) చేస్తామని ప్రకటించింది. ప్రైవేట్​ టెలికాం ఆపరేటర్ల దాటికి బీఎస్​ఎన్​ఎల్​ కుదేలైంది. దేశవ్యాప్తంగా విస్తారంగా నెట్​వర్క్​ ఉన్నా.. వినియోగదారులు లేక గతంలో వెలవెలబోయింది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో బీఎస్​ఎన్​ఎల్​ మళ్లీ పునరుజ్జీవం సంతరించుకుంటోంది. ఈ క్రమంలో వినియోగదారులను ఆకర్షించడానికి పలుచర్యలు చేపడుతోంది.

    తాజాగా బీఎస్​ఎన్​ఎల్​ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ లేకుండా.. ఆన్​లైన్​లో అప్లయ్​ చేసుకుంటే ఇంటికే సిమ్ కార్డు పంపిస్తామని తెలిపింది. సెల్ఫ్​ ఈ కేవైసీ (e KYC) ప్రక్రియతో సిమ్​ కార్డు పొందే అవకాశం కల్పిస్తోంది.

    BSNL Sim | పోటీ తట్టుకోవడానికి..

    ఇప్పటికే మార్కెట్​లో జియో, ఎయిర్​టెల్​, వొడాఫోన్​ ఐడియాలు ఉచితంగా సిమ్​లను డోర్​ డెలివరీ చేస్తున్నాయి. దీంతో పోటీని తట్టుకోవడానికి బీఎస్​ఎన్​ఎల్​ సైతం తాజాగా సిమ్​కార్డు డోర్​ డెలివరీ సర్వీస్​ను ప్రారంభించింది. ప్రైవేట్​ ఆపరేటర్లతో పోటీ తట్టుకోవడానికి బీఎస్​ఎన్​ఎల్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ (Hyderabad)లో 5G సేవలను సాఫ్ట్‌గా ప్రారంభించిన విషయం తెలిసిందే. మరోవైపు 4జి, 5జి నెట్‌వర్క్ టవర్లను పెంచడానికి కృషి చేస్తోంది.

    BSNL Sim | పెరిగిన కస్టమర్లు

    బీఎస్​ఎన్​ఎల్​కు గత ఏడాది కాలంలో యూజర్లు భారీగా పెరిగారు. ప్రైవేట్​ ఆపరేటర్లు భారీగా రీఛార్జ్​ రేట్లను పెంచడంతో వినియోగదారులు మళ్లీ బీఎస్​ఎన్​ఎల్​ వైపు మళ్లారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆ సంస్థ యూజర్ల కోసం పలు ప్రత్యేక ప్లాన్లు కూడా తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులు పెరిగారు.

    BSNL Sim | ఆన్​లైన్​లో​ సిమ్​ పొందడం ఎలా..

    బీఎస్​ఎన్​ఎల్​ సిమ్​ డోర్​ డెలివరీ కోసం https://sancharaadhaar.bsnl.co.in/BSNLSKYC/ వెబ్​సైట్​ను సందర్శించాలి. అందులో అవసరమైన వివరాలు ఎంటర్​ చేయాలి. అనంతరం కేవైసీ పూర్తిచేయాలి. కేవైసీ అయిపోయిన తర్వాత అప్లికేషన్​ను సబ్​మిట్​ కొడితే ప్రత్యామ్నాయ ఫోన్​ నంబర్​కు ఓటీపీ వస్తోంది. దానిని అందులో నమోదు చేస్తే ఇంటికే బీఎస్​ఎన్​ఎల్​ సిమ్​ కార్డు వస్తుంది. సిమ్​కార్డు డోర్​ డెలివరీలో ఏమైనా సమస్యలుంటే. 1800-180-1503లో టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్‌కు ఫోన్​ చేయాలని బీఎస్​ఎన్​ఎల్​ సూచించింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...