HomeUncategorizedTatkal Bookings | తత్కాల్​ టికెట్ల బుకింగ్​.. ఇకపై ఈ ఆధార్​ తప్పనిసరి

Tatkal Bookings | తత్కాల్​ టికెట్ల బుకింగ్​.. ఇకపై ఈ ఆధార్​ తప్పనిసరి

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Tatkal Bookings | తత్కాల్ టికెట్ల(Tatkal Tickets) జారీలో జ‌రుగుతున్న అవ‌క‌త‌వ‌క‌ల‌ను నియంత్రించేందుకు భార‌తీయ రైల్వే (Indian Railways) కీలక నిర్ణ‌యం తీసుకొంది. తత్కాల్ టికెట్లు పొందేందుకు ఈ-ఆధార్ త‌ప్ప‌నిస‌రి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ వెల్లడించారు.

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్(Railway Minister Ashwini Vaishnav) ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ-ఆధార్ ఆధారంగా తత్కాల్ టికెట్లు పొందే వెసులుబాటు త్వరలోనే అందుబాటులోకి రానుందని చెప్పారు. అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో నిజ‌మైన అవసరం ఉన్నవారికి క‌న్ఫ‌ర్మ్ టికెట్లు ద‌క్కాల‌న్న సదుద్దేశంతో ఈ-ఆధార్‌(E-Aadhaar)ను తత్కాల్ టికెట్ల‌కు త‌ప్ప‌నిస‌రి చేస్తున్న‌ట్లు వివరించారు.

Tatkal Bookings | ఏఐతో అక్రమాలకు అడ్డుకట్ట

ఐఆర్సీటీసీ పోర్ట‌ల్(IRCTC portal) నుంచి టికెట్ల బుకింగ్​లో అక్ర‌మాల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నంలో భాగంగా సుమారు 2.5 కోట్ల బోగ‌స్ ఐడీల‌ను బ్లాక్ చేసిన‌ట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఏఐ ఆధారిత వ్య‌వ‌స్థ ద్వారా సదరు ఐడీల‌ను డీయాక్టివేట్ చేసిన‌ట్లు వివరించింది. మే 22న ఒక్క నిమిషంలో అత్య‌ధిక సంఖ్య‌లో టికెట్లు బుక్ అయినట్లు ఆ శాఖ వెల్లడించింది. కేవ‌లం 60 సెక‌న్ల‌లో 31,814 టికెట్లు బుక్ అయినట్లు వివరించింది. ఆప‌రేష‌న‌ల్ సామ‌ర్థ్యంలో ఇదో కొత్త మైలురాయి అని రైల్వే శాఖ పేర్కొంది.

తత్కాల్ బుకింగ్ స‌మ‌యంలో.. మొద‌టి ఐదు నిమిషాల్లో ట్రాఫిక్ తారాస్థాయిలో తాకిడి ఉంటుంద‌ని రైల్వే శాఖ తెలిపింది. కానీ, కొత్త బాట్ సిస్ట‌మ్ ద్వారా ఆ ట్రాఫిక్‌ను రెగ్యులేట్ చేసిన‌ట్లు పేర్కొన్న‌ది. టికెట్ బుకింగ్ సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు కొత్త యూజ‌ర్ ప్రొటోకాల్స్‌(User protocols)ను ఇంట్ర‌డ్యూస్ చేసిన‌ట్లు చెప్పింది. ఆధార్ వెరిఫికేష‌న్ లేని యూజ‌ర్లు, రిజిస్ట్రేష‌న్ త‌ర్వాత మూడు రోజుల‌కు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ, ఈ-ఆధార్ వెరిఫై యూజ‌ర్స్ కు ఎలాంటి జాప్యం లేకుండా టికెట్స్ పొందొచ్చు.

Must Read
Related News