HomeజాతీయంSI Job Notification | ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

SI Job Notification | ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్ : SI Job Notification | పలు పోస్టుల భర్తీ కోసం స్టాఫ్‌ సెలెక‌్షన్‌ కమిషన్‌(SSC) చర్యలు చేపట్టింది. ఢిల్లీ పోలీస్‌, సెంట్రల్‌ ఆర్మ్డ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌(CAPF)లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(Sub Inspector) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌ వివరాలిలా ఉన్నాయి.

భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 3,073 (పురుషులు, మహిళలు)

పోస్టుల వివరాలు..

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎగ్జిక్యూటివ్‌) ఇన్‌ Delhi పోలీస్‌ : 212
సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(జనరల్‌ డ్యూటీ) ఇన్‌ బీఎస్‌ఎఫ్‌ : 223
సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(జనరల్‌ డ్యూటీ) ఇన్‌ సీఐఎస్‌ఎఫ్‌ : 1,294
సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(జనరల్‌ డ్యూటీ) ఇన్‌ సీఆర్‌పీఎఫ్‌ : 1,029
సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(జనరల్‌ డ్యూటీ) ఇన్‌ ఐటీబీపీ : 233
సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(జనరల్‌ డ్యూటీ) ఇన్‌ ఎస్‌ఎస్‌బీ : 82

అర్హతలు..

విద్యార్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత.
ఎత్తు : పురుషులు – 170 సెం.మీ, మహిళలు – 165 సెం.మీ.
చెస్ట్‌ : పురుషులకు 80-85 సెం.మీ.

వయోపరిమితి : ఈ ఏడాది ఆగస్టు నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య వారు అర్హులు.
ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ,ఈఎస్‌ఎం అభ్యర్థులకు మూడేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం : రూ 35,400 – రూ. 1,12,400

దరఖాస్తు గడువు : అక్టోబర్‌ 16
దరఖాస్తు రుసుము : రూ. 100 (ఎస్సీ, ఎస్టీ, Ex-Servicemenకు ఫీజు లేదు)
దరఖాస్తు సవరణకు అక్టోబర్‌ 24–26 వరకు అవకాశం ఉంటుంది.

పరీక్ష తేదీలు : నవంబర్‌ – డిసెంబర్‌ మధ్యలో ఉంటాయి.
ఎంపిక విధానం : రాత పరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (PST), ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌ (PET)
పూర్తి వివరాలు, దరఖాస్తుల కోసం వెబ్‌సైట్‌ https://ssc.gov.in/ లో సంప్రదించగలరు.

Must Read
Related News