HomeతెలంగాణLocal body elections Notification | రేపు యథావిధిగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్.. మొదటి...

Local body elections Notification | రేపు యథావిధిగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్.. మొదటి విడత వేటికంటే..

స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. బీసీ రిజర్వేషన్లపై వేసిన పిటిషన్​పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల నోటిఫికేషన్‌ను ఆపాలని వేసిన దావాను కోర్టు తోసిపుచ్చింది. దీంతో గురువారం (అక్టోబరు 9) నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ Election Commission యథావిధిగా విడుదల చేయనుంది.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Local body elections Notification | స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. బీసీ రిజర్వేషన్లపై వేసిన పిటిషన్​పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది.

ఎన్నికల నోటిఫికేషన్‌ను ఆపాలని వేసిన దావాను కోర్టు తోసిపుచ్చింది. దీంతో గురువారం (అక్టోబరు 9) నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ Election Commission యథావిధిగా విడుదల చేయనుంది.

Local body elections Notification | మొదటి విడత..

తెలంగాణ(Telangana)లోని 31 జిల్లాల్లో ఉన్న 565 మండలాల్లో 5 దశల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.

రేపు తొలి నోటిఫికేషన్ ఎంపీటీసీ MPTC, జడ్పీటీసీ ZPTC ఎన్నికలకు ఈసీ రిలీజ్​ చేయనుంది. గురువారం ఉదయం 10:30 గంటల నుంచి నామినేషన్ల nominations స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది.

అక్టోబరు 13 నుంచి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. అక్టోబరు 23న తొలి విడత, అక్టోబరు 27న రెండో విడత పోలింగ్‌ నిర్వహిస్తారు. నవంబరు 11న ఓట్ల votes లెక్కింపు ప్రక్రియ చేపడతారు.