అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills | జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు (Jubilee Hills by-election) సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
22న నామినేషన్ల (nominations) పరిశీలన, 24 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. నవంబర్ 11న ఎన్నిక, 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ జారీ కావడంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. షేక్‌పేట తహసీల్దార్ ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని (nomination reception center) ఆయన సోమవారం పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.
Jubilee Hills | షేక్‌పేట్‌లో నామినేషన్ల స్వీకరణ
ఉప ఎన్నికకు గెజిటె్ నోటిఫకేషన్ జారీ కావడంతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈనెల 21 వరకు నామినేషన్లకు గడువు ఉంటుందని ఎన్నికల అధికారి కర్ణన్ (Election Officer Karnan) తెలిపారు. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని వివరించారు. ఈనెల 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందని చెప్పారు. అనంతరం బ్యాలెట్ పేపర్లు ముద్రిస్తామని చెప్పారు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరుగుతుందన్నారు. 14న యూసఫ్‌గూడ (Yousafguda) కోట్ల
విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు.
Jubilee Hills | మధ్యాహ్నం వరకే..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం (Election Commission) కఠిన ఆంక్షలు విధించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరణ కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. రిటర్నింగ్ ఆఫీస్‌కి 100 మీటర్ల మేర ఆంక్షలు విధించినట్లు చెప్పారు. నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరో నలుగురిని మాత్రమే రిటర్నింగ్ ఆఫీస్‌లోకి (returning office) అనుమతి ఇవ్వనున్నారు. రిటర్నింగ్ ఆఫీస్ ఆవరణలోకి మూడు వాహనాలు మాత్రమే అనుమతి ఉంటుంది. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులకు ఒక ప్రతిపాదించే నియోజకవర్గ ఓటరు ఉండాలని పేర్కొన్నారు. ఇండిపెండెంట్, గుర్తింపు లేని పార్టీ అభ్యర్థులకు పది మంది నియోజకవర్గ ఓటర్లు ప్రతిపాదించాలని వివరించారు.