అక్షరటుడే, వెబ్డెస్క్: RTC Posts | రాష్ట్ర ప్రభుత్వం (State Government) నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆర్టీసీలో శ్రామిక్, డ్రైవర్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. తాజాగా ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రెయినీ, మెకానికాల్ సూపర్వైజర్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఒక నోటిఫికేషన్ను జారీ చేసింది.
RTC Posts | ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ
ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (Traffic Supervisor Trainee) పోస్టులు 84 పోస్టులు, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (Mechanical Supervisor Trainee) పోస్టుల 114 భర్తీ చేయనున్నారు. వీటి కోసం ఈ నెల 30న ఉదయం 8 గంటల నుంచి జనవరి 20 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీలు రూ.400, ఇతరులు రూ.800 ఫీజు చెల్లించాలి. https://www.tgprb.in/వెబ్సైట్లో దరఖాస్తు చేసోకోవచ్చు. టీఎస్టీ పోస్టుల కోసం ఏదైనా డిగ్రీ చదివిన వారు అర్హులు. ఎంసీటీ పోస్టులకు ఆటోమొబైల్ లేదా మెకానికాల్ ఇంజినీరింగ్లో డిప్లోమా చేసిన వారు అర్హులు. రాత పరీక్ష ద్వారా పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి రూ.27,080 – రూ.81,400 పే స్కేల్ అమలు చేస్తారు.