అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Surveyor Posts | రాష్ట్రంలో ఆరు వేల సర్వేయర్ పోస్టుల Surveyor Posts భర్తీకి త్వరలో నోటిఫికేషన్ notification విడుదల చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి Ponguleti Srinivas Reddy తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ KCRపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ revenue system నాశనమైందని ఆరోపించారు. తమ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెడుతుందన్నారు.
Surveyor Posts | మంత్రులను పని చేయనివ్వలేదు
బీఆర్ఎస్ హయాంలో మంత్రులకు ministers పవర్ ఉండేది కాదని పొంగులేటి అన్నారు. మంత్రులను కేసీఆర్ పని చేయనివ్వలేదని ఆరోపించారు. మంత్రులు తమ శాఖలపై స్వేచ్ఛగా రివ్యూ చేసుకునే పరిస్థితి కూడా ఉండేది కాదన్నారు.
Surveyor Posts | త్వరలో భూ భారతి
రాష్ట్రవ్యాప్తంగా త్వరలో భూ భారతి Bhu Bharati అమలులోకి తెస్తామని మంత్రి తెలిపారు. జూన్‌లో సర్వే మ్యాప్ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి జరగనివ్వబోమని స్పష్టం చేశారు. భూ భారతి 70 శాతం మంది ప్రజలకు ఉపయోగ పడిన తాము సక్సెస్ అయినట్లేనని చెప్పారు.