అక్షరటుడే, వెబ్డెస్క్ : Job Notification | తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (Co-operative Apex Bank) లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 225 స్టాఫ్ అసిస్టెంట్ (Staff Assistant) పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.
పలు జిల్లాల్లోని సహకార బ్యాంకుల్లో ఉన్న స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా వేర్వురు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. హైదరాబాద్ (Hyderabad), కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లోని బ్యాంకుల్లో మొత్తం 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను ప్రస్తుతం భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వీటికోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 6లోపు అప్లికేషన్ గడువు ఉంది. ఏదైనా డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
Job Notification | ఖాళీల వివరాలు..
కరీంనగర్‌లో 43, ఖమ్మంలో 99, వరంగల్లో 21, హైదరాబాద్లో 32, మెదక్లో 21, మహబూబ్నగర్లో 9 పోస్టులున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు తెలుగు భాషలో నైపుణ్యం, ఆంగ్ల భాష పరిజ్ఞానం తప్పనిసరి. 01.10.2025 నాటికి 18 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులు. పలు విభాగాల వారికి వయసు సడలింపులు ఉంటాయి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు కోసం ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.250 ఫీజు చెల్లించాలి. మిగతా వారు రూ.750 కట్టాలి. ఇతర వివరాలకు వెబ్సైట్ను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఎంపికైన వారికి నెలకు రూ.24,050 – రూ.64,480 మధ్య జీతం చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు ఉంటాయి.