అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Job Notification | రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలో (FSL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 60 పోస్టులను భర్తీ చేయన్నట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ప్రకటించింది. ఈ నెల 27 నుంచి డిసెంబర్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
సైంటిఫిక్ ఆఫీసర్స్ (Scientific Officers), సైంటిఫిక్ అసిస్టెంట్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ల్యాబ్ అసిస్టెంట్స్ (అటెండెంట్స్) వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టులో పీజీ, డిగ్రీ పూర్తి చేసిన వారు అనర్హులు. ల్యాబ్ అటెండెంట్ (Lab Attendant) పోస్టులకు ఇంటర్ చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 34 ఏళ్ల వయసు వారు అర్హులు. పలు విభాగాల వారికి వయో పరిమితిలో సడలింపులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం టీఎస్ఎల్పీఆర్బీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Job Notification | వేతన వివరాలు
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష వివరాలను రిక్రూట్మెంట్ బోర్డు తర్వాత ప్రకటించనుంది. సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికైతే రూ.45,960 – రూ.1,24,150 వేతనం అందిస్తారు. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు రూ.42,300 – రూ.1,15,270, ల్యాబ్ టెక్నిషియన్‌కు రూ.24,280 – రూ.72,850, ల్యాబ్ అటెండెంట్‌కు రూ.20,280 – రూ.62,110 పే స్కేల్ అమలు చేస్తారు.
