RFCL Notifications | ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. 15తో ముగియనున్న దరఖాస్తు గడువు

అక్షరటుడే, వెబ్​డెస్క్ :  RFCL Notifications | మేనేజిరియల్‌ పోస్టుల భర్తీ కోసం ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంస్థకు సంబంధించిన రామగుండం (Ramagundam) ప్లాంట్‌తోపాటు నొయిడా కార్పొరేషన్‌ కార్యాలయం (Noida Corporation Office)లో ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌, ఐటీ తదితర విభాగాల్లో జనరల్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్‌, మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌్‌ పోస్టులను భర్తీ చేయడం కోసం అర్హులైనవారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్‌ వివరాలిలా ఉన్నాయి. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ :  RFCL Notifications | మేనేజిరియల్‌ పోస్టుల భర్తీ కోసం ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంస్థకు సంబంధించిన రామగుండం (Ramagundam) ప్లాంట్‌తోపాటు నొయిడా కార్పొరేషన్‌ కార్యాలయం (Noida Corporation Office)లో ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌, ఐటీ తదితర విభాగాల్లో జనరల్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్‌, మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌్‌ పోస్టులను భర్తీ చేయడం కోసం అర్హులైనవారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్‌ వివరాలిలా ఉన్నాయి.

భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 36

విభాగాల వారీగా పోస్టుల వివరాలు..

ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్‌ : 01
ఫార్మసీ : 01
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ : 01
ట్రాన్స్‌పోర్టెషన్‌ : 01
సివిల్‌ : 01
ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ : 02
కెమికల్‌ ల్యాబ్‌ : 02
మెకానికల్‌ : 03
ఇన్‌స్ట్రుమెంటేషన్‌ : 04
మెటీరియల్స్‌ : 05
హ్యూమన్‌ రిసోర్సెస్‌ : 05
కెమికల్‌ : 10

అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ, ఎంబీఏ, సీఏ/సీఎంఏ, ఎంఎస్సీ, పీజీ డిప్లొమా, బీఫార్మసి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ఉద్యోగానుభవం కలిగి ఉండాలి.

వేతన శ్రేణి వివరాలు..

అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ. 50,000- రూ. 1,60,000.
డిప్యూటీ మేనేజర్‌కు రూ. 60,000- రూ. 1,80,000.
మేనేజర్‌కు రూ. 70,000- రూ. 2,00,000.
సీనియర్‌ మేనేజర్‌కు రూ. 80,000- రూ. 2,20,000.
చీఫ్‌ మేనేజర్‌కు రూ. 90,000- రూ. 2,40,000.
డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌కు రూ. 1,00,000- రూ. 2,60,000.
జనరల్‌ మేనేజర్‌కు రూ. 1,20,000- రూ. 2,80,000.

వయోపరిమితి : అసిస్టెంట్‌/డిప్యూటీ మేనేజర్లకు 40 ఏళ్లు, మేనేజర్‌/సీనియర్‌ మేనేజర్లకు 45 ఏళ్లు, చీఫ్‌ మేనేజర్‌/డీజీఎంకు 50ఏళ్లు, జనరల్‌ మేనేజర్‌కు 55 ఏళ్లు మించరాదు.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తయ్యాక ప్రింట్‌ తీసుకొని అవసరమైన సర్టిఫికెట్లను జత చేసి నోయిడా కార్పొరేట్‌ కార్యాలయానికి పోస్టు ద్వారా పంపించాలి.

దరఖాస్తు రుసుము : రూ. 700 – రూ.1000Ñ ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : జనవరి 15.

హార్డ్‌ కాపీలు పంపించడానికి చివరి తేదీ : జనవరి 22.

ఎంపిక విధానం : షార్ట్‌లిస్టింగ్‌, సీబీటీ (Computer Based Test), ఇంటర్వ్యూ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు https://www.rfcl.co.in వెబ్‌సైట్‌లో సంప్రదించండి.

Related articles

Telangana temperature rise | వర్షాలు బంద్​.. పెరగనున్న ఉష్ణోగ్రతలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana temperature rise | బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజులుగా...

Inter Exams Begin | ఇంటర్​ పరీక్షలు ప్రారంభం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inter Exams Begin | రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్​ ​పరీక్షలు (Inter Exams) ప్రారంభం అయ్యాయి. ఫస్టియర్​ విద్యార్థులు ఉదయం 9...

Modi Israel Visit 2026 | ప్రధాని మోదీ ఇజ్రాయెల్​ పర్యటన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Israel Visit 2026 | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi) ఇజ్రాయెల్​లో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో...

Trump India Pakistan War | పాక్​లో 35 మిలియన్ల ప్రజలు చనిపోయే వారు.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump India Pakistan War | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (Donald Trump)​ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు....