HomeతెలంగాణAnganwadi | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అంగన్​వాడీల్లో 6,399 టీచర్, 7,837 ఆయా​ పోస్టుల భర్తీకి...

Anganwadi | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అంగన్​వాడీల్లో 6,399 టీచర్, 7,837 ఆయా​ పోస్టుల భర్తీకి అడుగులు.. త్వరలోనే నోటిఫికేషన్!

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: నిరుద్యోగ మహిళా అభ్యర్థులకు తీపి కబురు అందనుంది. తెలంగాణలోని అంగన్​వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్(Notification)​ వెలువడనుంది. రాష్ట్రంలోని అంగన్​వాడీ కేంద్రాల్లో సుమారు 20 శాతం టీచర్లు, హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల క్షేత్రస్థాయిలో అంగన్​వాడీ చిన్నారులకు, గర్భిణులు, బాలింతలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఖాళీ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Anganwadi : ఇటీవలే సమీక్ష..

ఈమేరకు అంగన్​వాడీ కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేయాలని సర్కారు నిర్ణయిచింది. మొత్తం 14,236 పోస్టులకు ఆమోదం తెలిపింది. దీనిపై సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Welfare Minister Seethakka) ఇటీవలే సమీక్షించారు. పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక, ఖాళీల విషయానికి వస్తే.. పూర్తి ఖాళీల్లో 7,837 హెల్పర్, 6,399 టీచర్​​ పోస్టులు ఉన్నాయి.

రాష్ట్రంలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు (Anganwadi centers) ఉన్నాయి. మినీ కేంద్రాలు మినహా.. సాధారణంగా ప్రతి కేంద్రంలో టీచర్​(teacher)తో పాటు హెల్పర్‌ ఉంటారు. 65 ఏళ్లు నిండిన వారి రిటైర్​మెంట్, సూపర్​వైజర్లుగా ప్రమోషన్​లు రావడంతో ఆయా చోట్ల ఖాళీలు ఏర్పడ్డాయి. ఇలాంటి కేంద్రాల్లో ఇన్​ఛార్జి పాలనలో చిన్నారులు(children), లబ్ధిదారులు ఇబ్బందిపడుతున్నారు.

Anganwadi : ఏజెన్సీ ప్రాంతాల్లో…

కేవలం పదవీ విరమణ పొందినవారే సుమారు 7 వేల వరకు ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేంద్రాల్లో స్థానిక గిరిజనులు, ఆదివాసీలనే నియమించి, వారితోనే పూర్వ ప్రాథమిక విద్యను మాతృభాషలో అందించాలని తెలంగాణ ప్రభుత్వం (Telangana government) యోచిస్తోంది. అయితే, ఇలా నియామకాలు చేపట్టాలంటే కొన్ని అడ్డంకులు సమస్యగా మారాయి.

Anganwadi : సుప్రీంకోర్టు జీవోను కొట్టివేయడంతో..

ఏజెన్సీ ప్రాంతాల్లో(agency areas)ని ఉద్యోగాల్లో గతంలో స్థానిక ఆదివాసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించేవారు. అయితే ఇలా రిజర్వేషన్లు కల్పించే జీవోను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానికులకు ఉద్యోగం కల్పించేందుకు ఎలా ముందుకు వెళ్లాలని సర్కారు యోచిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించి, మాతృభాషలో పూర్వ ప్రాథమిక విద్య అందిస్తే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చనేది ప్రభుత్వం ఆలోచన.

Anganwadi : అధ్యయనం తర్వాతే..

సాధారణ ఉద్యోగ ప్రకటనగా నోటిఫికేషన్‌ ఇస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో మాతృభాషలో విద్యాబోధన సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్​లో సంబంధిత భాషల అంశాన్ని పొందుపర్చితే ఎదురయ్యే ఎలా ఉంటుందనేది సర్కారు ఆలోచన. ఇదే విషయం మీద అంటే.. ఇతర రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఏవిధంగా నియామకాలు చేపడుతున్నారో అధ్యయనం చేయాలని అధికారులను శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ నివేదిక వచ్చాకే ఓ నిర్ణయం తీసుకుని నోటిఫికేషన్​ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.