HomeజాతీయంSainik Schools | సైనిక్​ స్కూల్​లో ప్రవేశాలకు నోటిఫికేషన్​

Sainik Schools | సైనిక్​ స్కూల్​లో ప్రవేశాలకు నోటిఫికేషన్​

Sainik Schools | సైనిక్​ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్​ వెలువడింది. ఆరు, తొమ్మిదో తరగతిలో ప్రవేశాల కోసం ఈ నెల 30 వరకు ఆన్​లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sainik Schools | దేశవ్యాప్తంగా సైనిక్​ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్​ వెలువడింది. నేషనల్ టెస్టింగ్​ ఏజెన్సీ ఆధ్వర్యంలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలను సైనిక్​ స్కూళ్లలో(Sainik Schools) చేర్చాలని కలలు కంటారు. ఈ క్రమంలో తాజాగా ఎన్​టీఏ సైనిక్​ బడుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్​ విడుదల చేసింది. అక్టోబర్​ 10 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2026–27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి, తొమ్మిదో తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం ఐదు, ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Sainik Schools | ఫీజు వివరాలు

దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆన్​లైన్​లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.700, జనరల్​, ఓబీసీ, ఎక్స్​ సర్వీస్​మెన్​ పిల్లలు రూ.850 కట్టాలి. అక్టోబర్​ 31 రాత్రి 11:30 గంటల వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. విద్యార్థులు ఆన్​లైన్​లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల్లో తప్పిదాల సవరణ కోసం నవంబర్​ 2 నుంచి 4 వరకు అవకాశం కల్పిస్తారు.

Sainik Schools | పరీక్ష విధానం

సైనిక్​ స్కూల్ ప్రవేశ పరీక్ష(Sainik School Entrance Exam) ఆఫ్​లైన్​లో జరుగుతుంది. ఓఎంఆర్​ షీటు ద్వారా పరీక్ష నిర్వహిస్తారు. మల్టిపుల్​ చాయిస్​ ప్రశ్నలకు ఓఎంఆర్​ షీట్​(OMR Sheet)లో విద్యార్థులు బబ్లింగ్​ చేయాల్సి ఉంటుంది. ఆరో తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష వ్యవధి 150 నిమిషాలు ఉంటుంది. తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్ష వ్యవధి 180 నిమిషాలు. 2026 జనవరిలో ప్రవేశ పరీక్ష ఉంటుంది. పరీక్ష జరిగిన నాలుగు నుంచి ఆరు వారాల్లో ఫలితాలు ప్రకటిస్తారు. పూర్తి వివరాల కోసం ఎన్​టీఏ వెబ్​సైట్​ను సందర్శించాలని అధికారులు సూచించారు.