అక్షరటుడేర, వెబ్డెస్క్ : EPFO Notifications | ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో (EPFO) పలు పోస్టుల భర్తీకి యూపీఎస్సీ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్(Account officer), అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (ఈవో/ఏవో/ఏపీఎఫ్‌సీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్(Notification) వివరాలిలా ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య : 230
పోస్టుల వారీగా వివరాలు :
1. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/అకౌంట్ ఆఫీసర్: 156 (యూఆర్ -78, ఈడబ్ల్యూఎస్ -01, ఓబీసీ -42, ఎస్సీ -23, ఎస్టీ -12, పీడబ్ల్యూబీడీ -09)
2. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ : 74 (యూఆర్ -32; ఈడబ్ల్యూఎస్ -07; ఓబీసీ -28, ఎస్సీ -07, పీడబ్ల్యూబీడీ -03)
అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (Bachelor’s degree) ఉత్తీర్ణులై ఉండాలి. కంపెనీ లా/లేబర్ లా/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి : ఎన్‌ఫోర్స్‌మెంట్/అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు 30 ఏళ్లు.
అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టుకు 35 ఏళ్లు. (ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీలకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.)
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..
దరఖాస్తు రుసుము : ఒక పోస్టుకు రూ. 25, రెండు పోస్టులకు రూ.50. (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు).
దరఖాస్తు గడువు : ఆగస్టు 18
ఎంపిక విధానం : కంబైన్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(CRT), ఇంటర్వ్యూ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
పరీక్షా కేంద్రాలు : దేశవ్యాప్తంగా గల 78 ముఖ్య నగరాల్లో ఏర్పాటు చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, అనంతపురంలలో ఉంటాయి.
పూర్తి వివరాలు, దరఖాస్తుల కోసం https://upsconline.nic.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలి.