- Advertisement -
HomeతెలంగాణCongress | మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావుకు నోటీసులు

Congress | మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావుకు నోటీసులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Congress | మహిళా కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు(Sunita Rao)కు జాతీయ అధ్యక్షురాలు అల్కాలాంబ బుధవారం షోకాజ్​ నోటీసు(Show Cause Notice)లు జారీ చేశారు.

ఈనెల 14న పీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్​(PCC President Mahesh Kumar Goud)పై సునీతారావు పలు ఆరోపణలు చేశారు. నామినేటేడ్​ పదవుల భర్తీ విషయంలో మహిళా కాంగ్రెస్​కు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అంతేగాకుండా గాంధీభవన్​లోని పీసీసీ చీఫ్​ ఎదుట కూర్చొని నిరసన తెలిపారు. ఈ విషయమై ఆమెపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ క్రమంలో AICC మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబ నోటీసులు ఇచ్చారు. ఏడు రోజుల్లో నోటీసులకు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు.

- Advertisement -


కాగా.. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పై తప్పుడు ఆరోపణలు చేసిన సునీతారావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని గోషామహల్ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్​ చేశారు. ఈ మేరకు మంగళవారం గాంధీ భవన్​(Gandhi Bhavan)లో నిరసన తెలిపిన విషయం తెలిసిందే. సునీతా రావు హఠావో.. కాంగ్రెస్ బచావో అంటూ వారు నినాదాలు చేశారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News