అక్షరటుడే, ఆర్మూర్ : Sri Chaitanya School | పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలకు (Sri Chaitanya School) ఎంఈవో రాజగంగారాం నోటీసులు జారీ చేశారు. విద్యార్థులకు టీసీలు ఇవ్వడానికి పాఠశాల డబ్బులు వసూలు చేస్తున్నట్లు విద్యాశాఖకు (Education Department) ఫిర్యాదులు అందాయి. దీంతో ఎంఈవో రాజగంగారాం (MEO Rajagangaram) స్కూల్లో విచారణ చేపట్టారు. అనంతరం శుక్రవారం పాఠశాలకు నోటీసులు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. విద్యార్థులకు టీసీలు జారీ చేసేందుకు ఏ పాఠశాలనైనా డబ్బులు వసూలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫీజుల కోసం కూడా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తే సంబంధిత పాఠశాలలపై చర్యలు తప్పవని ఎంఈవో హెచ్చరించారు.