అక్షరటుడే, ఆర్మూర్ : Togarla Suresh | జిల్లాకు చెందిన ప్రముఖ కవి తొగల సురేష్ ‘పెందోట సాహిత్య పురస్కారం’ అందుకున్నారు. సిద్దిపేటలో శ్రీవాణి సాహిత్య పరిషత్ (Srivani Sahitya Parishad) ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పుస్తకాల పోటీలో తొగర్ల సురేశ్ రాసిన ‘వెన్నెల్లో మా పల్లె‘ (Vennello Maa Palle) పుస్తకానికి లభించింది. ఈ వివరాలను కవి కంకణాల రాజేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
సిద్దిపేట (Siddipet)లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వాహకులు పెందోట వెంకటేశ్వర్లు, ప్రముఖ బాలసాహితీవేత్త గరిపెల్లి అశోక్,క్రియాశీల కార్యవర్గ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొగర్ల సురేశ్ (Togarla Suresh)కు ఈ పురస్కారం, జ్ఞాపిక, సగదుతో సత్కరించారని ఆయన వివరించారు. ఈ సందర్భంగా తొగర్ల సురేశ్‌ను ప్రముఖ కవులు తిరుమల శ్రీనివాస్ ఆర్య, కంకణాల రాజేశ్వర్, మద్దుకూరి సాయిబాబు, స్వర్ణ సమత, దారం గంగాధర్, డాక్టర్ బోచ్కర్ ఓం ప్రకాశ్, లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఛైర్మన్, ప్రముఖ సామాజిక సేవకుడు, విశ్రాంత హెచ్ఎం చాకులింగం, సీనియర్ జర్నలిస్టు, బాల్కొండ చరిత్ర గ్రంథ రచయిత బ్రహ్మరౌతు నర్సింగ్ రావు తదితరులు అభినందించారు.
