ePaper
More
    Homeక్రీడలుSunil Gavaskar | శుభ్‌మన్ గిల్ కాదు.. టెస్ట్ కెప్టెన్సీకి అతనే సరైనోడు: సునీల్ గవాస్కర్

    Sunil Gavaskar | శుభ్‌మన్ గిల్ కాదు.. టెస్ట్ కెప్టెన్సీకి అతనే సరైనోడు: సునీల్ గవాస్కర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sunil Gavaskar | టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)కు అప్పగించాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) అన్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరా? అనేది చర్చనీయాంశంగా మారింది. వైస్ కెప్టెన్‌గా ఉన్న బుమ్రాకే టెస్ట్ కెప్టెన్సీ(Test Captaincy) బాధ్యతలు దక్కాల్సి ఉన్నా.. గాయాల బెడద నేపథ్యంలో అతన్ని లీడర్‌షిప్ గ్రూప్ నుంచి తప్పించినట్లు వార్తలు వచ్చాయి. దాంతో శుభ్‌మన్ గిల్(Shubman Gill).. టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది.

    ఈ టాపిక్‌పై స్పందించిన గవాస్కర్(Gavaskar).. టెస్ట్ కెప్టెన్సీకి గిల్ కంటే బుమ్రానే సరైనోడని అభిప్రాయపడ్డాడు. ‘టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్‌గా జస్‌ప్రీత్ బుమ్రాను నియమించాలి. ఎందుకంటే ప్రస్తుత జట్టులో అతనికే అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అతను ముందుండి జట్టును నడిపిస్తాడు. ఇతర ఆటగాళ్లపై అనవసరమైన ఒత్తిడి తీసుకురాడు. ఇప్పటికే అతను కొన్ని మ్యాచ్‌ల్లో సారథిగా వ్యవహరించాడు.

    జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)ను కెప్టెన్‌గా నియమిస్తే.. గాయాల బెడద కూడా ఉండదు. కెప్టెన్‌గా తన పనిభారం గురించి బాగా తెలుసుకోగలడు. అలా కాకుండా మరో ఆటగాడిని కెప్టెన్‌గా నియమిస్తే.. వారు బుమ్రాతో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయించవచ్చు. కానీ బుమ్రానే కెప్టెన్‌గా ఉంటే.. విశ్రాంతి కావాలన్నప్పుడు స్వేచ్ఛగా తీసుకుంటాడు’ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవితవ్యంపై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇద్దరూ వన్డే ప్రపంచకప్ 2027 వరకు జట్టులో కొనసాగలేరని చెప్పాడు. అద్భుతం జరిగితే తప్పా.. ఈ ఇద్దరూ మెగా వన్డే టోర్నీ(Mega ODI Tournament) ఆడలేరని కుండబద్దలు కొట్టాడు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...