అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nora Fatehi | ఇండియన్ సినీ ప్రేక్షకులకు నోరా ఫతేహీ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెనడాకు చెందిన ఈ బ్యూటీ బాలీవుడ్లో తన డాన్స్, గ్లామర్‌తోనే కాదు.. సౌత్ సినిమాల్లోనూ కనిపిస్తూ దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంది.
సోషల్ మీడియా (Social Media)లో మిలియన్ల ఫాలోవర్స్‌తో యూత్‌ను ఫిదా చేస్తున్న నోరా గురించి ఏ చిన్న వార్త వచ్చినా జాతీయ స్థాయిలో చర్చకు దారి తీస్తుంటుంది.అందాల ఆరబోత, డాన్స్ వీడియోలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే నోరా ఫతేహీ గురించి గతంలోనూ పలు ప్రేమ, పెళ్లి వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లేనని ఆమె పరోక్షంగా ఖండిస్తూ వచ్చింది. కానీ తాజాగా మరోసారి ఆమె పేరు ప్రేమ పుకార్లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
Nora Fatehi | ఫుట్‌బాల్ ప్లేయర్‌తో డేటింగ్ టాక్..
ఇటీవల నోరా ఫతేహీ మొరాకో ఫుట్‌బాల్ స్టార్ అచ్రాఫ్ హకీమి (Football Star Achraf Hakimi)తో సన్నిహితంగా ఉంటోందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మొరాకోలో జరిగిన ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ (Africa Cup of Nations) సమయంలో వీరిద్దరూ కలిసి కనిపించారని, దుబాయ్‌లోనూ ఒక ఈవెంట్లో కలిసి డాన్స్ చేసిన వీడియోలు బయటకు రావడంతో ఈ పుకార్లు మరింత బలపడ్డాయి. వీరిద్దరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.అయితే ఇటీవల కాలంలో ఏఐ ద్వారా తయారైన ఫోటోలు, వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుండటంతో.. నోరా – హకీమి డాన్స్ వీడియోలు నిజమా? లేక మార్ఫింగ్ చేశారా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో నోరా ఫతేహీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం వల్ల అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.
గతంలో ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు వెంటనే పుకార్లేనంటూ స్పందించిన నోరా.. ఈసారి మాత్రం మౌనంగా ఉండటం గమనార్హం. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా నేరుగా ప్రశ్నలు సంధిస్తున్నారు. “మీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందా?”, “ఎందుకు ఈసారి స్పందించడం లేదు?” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయినప్పటికీ నోరా మాత్రం సరైన సమయంలోనే సమాధానం ఇస్తుందేమోనని ఆమె అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా, సినిమాల పరంగా నోరా ఫతేహీ ప్రస్తుతం కాస్త సైలెంట్‌గా ఉంది. ఈ గ్యాప్ కారణంగానే ఆమెపై ఇలాంటి పుకార్లు వస్తున్నాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వచ్చే ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నోరా.. ముఖ్యంగా ‘కాంచన 4’ సినిమాపై ఆమె అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా హిట్ అయితే నోరా కెరీర్ మరోసారి జోరందుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.