అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Car Accidents | సినీ ఇండస్ట్రీలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు (Road Accidents) అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నోరా ఫతేహి, కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ (hero Sivakarthikeyan) ప్రయాణిస్తున్న కార్లు ప్రమాదాలకు గురయ్యాయి.
అయితే ఈ రెండు ఘటనల్లోనూ ఊపిరిపీల్చుకునే అంశం ఏమిటంటే.. ఇద్దరు సెలబ్రిటీలు క్షేమంగానే బయటపడటం. బాహుబలి ఫేమ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నోరా ఫతేహి ప్రయాణిస్తున్న కారు శనివారం (డిసెంబర్ 20) రోడ్డు ప్రమాదానికి గురైంది. గోవాలో జరిగే ప్రముఖ సన్‌బర్న్ ఫెస్టివల్‌కు హాజరవ్వడానికి వెళ్తుండగా ఆమె కారును మరో కారు ఢీ కొట్టింది. ఈ ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ వినయ్ సక్పాల్ (27) మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Car Accidents | క్షేమంగానే ఉన్నారు..
అయితే ఈ ప్రమాదంలో నోరా ఫతేహికి (Bollywood star heroine Nora Fatehi) ఎలాంటి గాయాలు కాలేదని, ఆమె పూర్తిగా సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకుని, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల అనంతరం నోరా ఫతేహి ముంబయిలో జరిగిన ఫెస్టివల్‌కు హాజరైనట్లు సమాచారం. డిసెంబర్ 20న కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రయాణిస్తున్న కారుకు కూడా ప్రమాదం జరిగింది. చెన్నైలోని కైలాశ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఆయన కారును వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో శివ కార్తికేయన్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఆయన కారు స్వల్పంగా డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది.
ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు (Police) వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. హీరోను మరో వాహనంలో పంపించినట్లు సమాచారం. శివ కార్తికేయన్ కారును ఢీ కొట్టిన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వరుసగా సెలబ్రిటీలకు సంబంధించిన ప్రమాదాలు జరగడం రోడ్డు భద్రతపై మరోసారి చర్చకు దారి తీస్తోంది. అదృష్టవశాత్తూ నోరా ఫతేహి, శివ కార్తికేయన్ ఇద్దరూ క్షేమంగా బయటపడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.