అక్షరటుడే, హైదరాబాద్: Bandi Sanjay | భాజపా సీనియర్ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar)కు షాక్ తగిలింది. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ (Non-bailable warrant) జారీ అయింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఉన్న నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు(Nampally Court) దీనిని జారీ చేసింది.
Bandi Sanjay : వారెంట్ ఎందుకంటే..
హుజురాబాద్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘించారనే కేసులో కోర్టు ఈ చర్యలకు ఉపక్రమించింది. ఈ కేసు విషయంలో హాజరుకావాలని కోర్టు చాలాసార్లు బండి సంజయ్కు నోటీసులు పంపింది. కానీ, ఆయన హాజరు కాకపోవడంతో కోర్టు సీరియస్ అయింది. తదుపరి చర్యలో భాగంగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది.
Bandi Sanjay : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో..
ప్రస్తుతం పార్లమెంట్ Parliament వర్షాకాల monsoon session సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఢిల్లీలో ఉన్నారు. ఇదే సమయంలో కోర్టు వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో కాస్త సమయం కోరుతూ ఆయన తరఫున న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.