అక్షరటుడే, కామారెడ్డి : Local Body Elections | ‘మా గ్రామం మీదుగా జాతీయ రహదారి ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణం చేయాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదు. అందుకే నామినేషన్స్ బహిష్కరిస్తున్నాం’ అంటూ శనివారం సదాశివనగర్ మండలం (Sadashivanagar Mandal) మల్లుపేట గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు.
Local Body Elections | చర్చిస్తున్న అధికారులు..
నామినేషన్ల దాఖలుకు శనివారం చివరి రోజు కావడంతో అధికారులు ఆఘమేఘాల మీద గ్రామానికి వెళ్లి గ్రామస్థులతో చర్చిస్తున్నారు. మల్లుపేట గ్రామం జాతీయ రహదారి (National Highway) నుంచి అరకిలోమీటర్ లోపలికి ఉంటుంది. పద్మాజీవాడి ఎక్స్‌రోడ్ నుంచి అతివేగంగా వచ్చే వాహనాలతో గ్రామ స్టేజి వద్ద తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. గొర్లు, మేకలు, వాహనాలకు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులకు వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అలాగే ఏళ్ల తరబడి తమ గ్రామ రెవెన్యూ పరిధి కల్వరాల్ గ్రామం (Kalvaral village)లో ఉందని, తమ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా మార్చాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.
అందుకే గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు హుటాహుటిన గ్రామానికి (Mallupeta Village) చేరుకుని గ్రామస్థులుతో మాట్లాడుతున్నారు. నామినేషన్లను చివరి రోజు కావడంతో వెంటనే నామినేషన్ వేయాలని గ్రామస్థులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.