అక్షరటుడే, భీమ్గల్: Bheemgal Municipality | మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో భీమ్గల్ పట్టణంలో సందడి మొదలైంది. బుధవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజే అభ్యర్థులు ఉత్సాహంగా తరలివచ్చారు. భీమ్గల్ మున్సిపాలిటీలోని (Bheemgal Municipality) 12 వార్డులకు గాను తొలిరోజు 4 నామినేషన్లు దాఖలయ్యాయి.
పార్టీల వారీగా వివరాలు: మొదటి రోజు అందిన నామినేషన్లలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) నుంచి దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బీఎస్పీ నుంచి ఒకరు నామినేషన్ వేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల (BJP and BRS parties) నుంచి మొదటి రోజు ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేదు.
Bheemgal Municipality | నిబంధనల అమలు..
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ సజావుగా సాగిందని ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా 21ఏళ్ల వయస్సు నిండి ఉండాలని, మున్సిపాలిటీలో ఓటరుగా నమోదై ఉండాలని అధికారులు గుర్తుచేశారు. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలతో పాటు నిర్ణీత ఫార్మాట్లో అఫిడవిట్లు సమర్పించారు.
Bheemgal Municipality | భద్రత కట్టుదిట్టం..
నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ అంకిత్ (Additional Collector Ankit) సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సహాయ కేంద్రం (హెల్ప్ డెస్క్) ద్వారా అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. పోలీస్ యంత్రాంగం నామినేషన్ కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేసింది.