అక్షరటుడే , బోధన్ : Municipal Elections | మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రావడంతో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. బోధన్ మున్సిపల్ (Bodhan Municipality) పరిధిలోని 38 వార్డులకు రెండు నామినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
Municipal Elections | పట్టణంలో..
పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్లో (Nomination Centers) ఒకటో వార్డ్ నుంచి 25వ వార్డు వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 25వ వార్డు నుండి 38 వార్డు వరకు నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నామినేషన్ సెంటర్లను బుధవారం రోజు జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ (Additional Collector Ankit) పరిశీలించారు. ఎటువంటి పొరపాట్లు చేయకుండా పకడ్బందీగా నామినేషన్లు స్వీకరించాలని సిబ్బందికి సూచించారు.
Municipal Elections | అభ్యర్థుల కోసం హెల్ప్‌డెస్క్..
అభ్యర్థులు అన్ని వివరాలతో నామినేషన్ పత్రాలను దాఖలు చేసేలా హెల్ప్‌డెస్క్ ద్వారా అవగాహన కల్పించాలని, సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావలికి కట్టుబడి ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా అధికారులు సమన్వయతో పనిచేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్‌తో పాటు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub Collector Vikas Mahato) కూడా ఉన్నారు.