అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Municipal Elections | మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ సెంటర్ను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) పరిశీలించారు. నాల్గో టౌన్ పరిధిలోని సెంటర్ను తనిఖీ చేశారు.
Municipal Elections | నాల్గో టౌన్ పరిధిలో..
జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్/ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నిజామాబాద్ డివిజన్ (Nizamabad Division)లో నామినేషన్ సెంటర్లను ఏర్పాట్లు చేస్తున్నారు. నాల్గోటౌన్ పరిధిలోని టీటీడీ కల్యాణ మండపం (TTD Kalyana Mandapam)లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సీపీ పరిశీలించారు. పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. నామినేషన్ సెంటర్ల సమీపంలో100 మీటర్లలోపు నిషేధిత ఉత్తర్వులు అమలులో ఉంటాయన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. సీపీ వెంట నిజామాబాద్ ఏసీపీ బి.ప్రకాష్, నాల్గో టౌన్ ఎస్హెచ్వో సతీష్ కుమార్, ఆర్వో వెంకటేష్, ఏఆర్వో రమేష్ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు.
Municipal Elections | విధుల్లో చేరిన కొత్త ఏసీపీ ప్రకాష్
నిజామాబాద్ ఏసీపీ బి ప్రకాష్ (Nizamabad ACP Prakash) బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు బుధవారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను కలిసి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లలో పాల్గొన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఏసీపీ రాజా వెంకట్రెడ్డి (ACP Raja Venkat Reddy) బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయనను డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.