అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nominated posts | కాంగ్రెస్ నాయకులకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (PCC President Mahesh Goud) గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. సర్పంచ్ ఎన్నికలు (Sarpanch elections) ముగియగానే ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ (Global Summit) విజయవంతం అయిందని మహేశ్‌గౌడ్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. గ్లోబల్ సమ్మిట్‌తో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని చెప్పారు.
Nominated posts | పదవులు భర్తీ చేస్తాం
రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల కోసం కాంగ్రెస్ నాయకులు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తి కావడంతో కాంగ్రెస్ నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్యలు చేపట్టింది. నెలాఖరులోపు కార్పొరేషన్ ఛైర్మన్లు, బోర్డు పదవులు భర్తీ చేస్తామని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీ సభ్యుల నియామకం సైతం చేపడుతామన్నారు. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు నామినేటెడ్ పదవుల కోసం పార్టీ పెద్దల వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సాగుతోంది. డిసెంబర్ 17తో సర్పంచ్ ఎలక్షన్లు అయిపోతాయి. అనంతరం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Nominated posts | అందుకోసమే కవిత విమర్శలు
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. తెలంగాణ భవిష్యత్‌కు గ్లోబల్ సమ్మిట్ సరికొత్త దశ అని చెప్పారు. ఆర్థిక లావాదేవీల్లో తేడాలతోనే కవిత బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నేతల అక్రమాలు బయటకు వస్తున్నాయని తెలిపారు. కవిత వ్యాఖ్యలపై సీఎం విచారణ జరిపించాలని కోరారు.