అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Zoom Meeting | రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. మరో 9 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) తీవ్రంగా శ్రమిస్తోంది.
పురపోరుపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సోమవారం ఉదయం మంత్రులు, పీఏసీ నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఆయన ఆదివారం అర్ధరాత్రి అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలువురు మంత్రులు, పీఏసీ సభ్యులతో ఆయన జూమ్ మీటింగ్‌లో మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.
CM Zoom Meeting | సమష్టిగా పని చేయాలి
అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ ఉంది. ఒక్కో వార్డు నుంచి అనేక మంది కాంగ్రెస్ నాయకులు నామినేషన్ వేశారు. టికెట్ రాని వారు రెబల్‌గా పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి రెబల్స్ లేకుండా చూడాలని ఆదేశించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు అని అన్ని సర్వేలు చెబుతున్నాయని తెలిపారు. అంతా సమష్టిగా పని చేయాలని, రెబల్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
CM Zoom Meeting | వారికి అవకాశం ఇస్తాం
పార్టీ కోసం పని చేసేవాళ్లను గెలిపించుకోవాలని సీఎం సూచించారు. టికెట్రాని బలమైన నాయకులు ఉంటే.. కార్పొరేషన్ పదవుల్లో అవకాశం ఇస్తామని హామీ ఇవ్వాలన్నారు. అభ్యర్థిని ఖరారు చేసిన వాళ్లే గెలుపు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ప్రతీ అభ్యర్థి లోకల్ గా మేనిఫెస్టో సిద్ధం చేసుకోని పోటీ చేయాలన్నారు. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. రేపటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. అధికార పార్టీలో టికెట్ రానివారిని నాయకులు బుజ్జగించి, నామినేషన్ ఉపసంహరించుకునేలా చేయనున్నారు. కాగా మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 4 నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు.