అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | ద్రవ్యోల్బణం (Inflation) తగ్గినా యూఎస్ టారిఫ్‌లపై స్పష్టత రాకపోవడంతో ఆర్‌బీఐ (RBI) ఆచితూచి వ్యవహరించింది. మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఈసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్ 16 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమైంది. అక్కడినుంచి 140 పాయింట్లు పెరిగినా.. ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్ తర్వాత ఒత్తిడికి గురవుతూ 386 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ(Nifty) 8 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమై 30 పాయింట్లు పెరిగింది. ఆ తర్వాత 127 పాయింట్లు కోల్పోయింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ (Sensex) 110 పాయింట్ల నష్టంతో 80,599 వద్ద, నిఫ్టీ 64 పాయింట్ల నష్టంతో 24,585 వద్ద కొనసాగుతున్నాయి.
Stock Market | అన్ని రంగాల్లో ఒత్తిడి..
అన్ని రంగాల షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. బీఎస్‌ఈ(BSE)లో రియాలిటీ 1.88 శాతం, హెల్త్‌కేర్ (Health care) 1.68 శాతం, ఐటీ 1.60 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.21 శాతం, కమోడిటీ ఇండెక్స్ 0.86 శాతం, టెలికాం 0.84 శాతం, ఆటో 0.80 శాతం, మెటల్ 0.79 శాతం, పవర్ ఇండెక్స్ 0.75 శాతం నష్టాలతో ఉన్నాయి. స్మాల్ క్యాప్(Small cap) ఇండెక్స్ 1.58 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.22 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.47 శాతం నష్టాలతో ఉన్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 12 కంపెనీలు లాభాలతో ఉండగా.. 18 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఆసియా పెయింట్ 2.02 శాతం, ట్రెంట్ 1.24 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.557 శాతం, బీఈఎల్ 00.44 శాతం, అదాని పోర్ట్స్ 0.41 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి.
Top Losers : టెక్ మహీంద్రా 1.85 శాతం, ఎటర్నల్ 1.59 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.55 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.43 శాతం, ఇన్ఫోసిస్ 1.37 శాతం నష్టాలతో ఉన్నాయి.