అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Delhi | తీవ్ర వాయు కాలుష్యం తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీ(Delhi)లో వాతావరణంలోని గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు అక్కడి సర్కార్(Government) చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వాయు కాలుష్యానికి కారణమవుతున్న వాహనాల ఉద్గారాలను నియంత్రించే దిశగా అడుగులు వేస్తోంది. 15 ఏళ్లుపైబడిన పెట్రోల్ వాహనాలు(Vehicles), 10 ఏళ్లకుపైబడిన డీజిల్(Diesel) వాహనాలు రోడ్డెక్కకుండా చూడాలని నిర్ణయించింది. ఆయా వాహనాలకు పెట్రోల్(Petrol), డీజిల్ విక్రాయించకుండా చర్యలు తీసుకుంటోంది. ఇది జూలై(July) ఒకటో తేదీనుంచి అమలులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ చర్యలను అమలు చేయడానికి ఢిల్లీలోని అన్ని బంక్‌లలో జూన్ చివరి నాటికి ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థ ఈవోఎల్(End Of Life) వాహనాలను గుర్తించి, వాటిలో ఇంధనం(Fuel) నింపకుండా నిరోధించేందుకు సాయం చేస్తుంది. కాగా ఈ ఆంక్షలు మొదట ఢిల్లీలో జూలై ఒకటో తేదీనుంచి అమలులోకి వచ్చే అవకాశాలు ఉండగా.. నవంబర్ 1 నుంచి నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) పరిధిలోని ఐదు జిల్లాల్లో అమలు అవుతాయని భావిస్తున్నారు. ఇందులో గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధనగర్, సోనిపట్‌లుంటాయి. మరోవైపు ఈ ఏడాది నవంబర్ 1 నుంచి బీఎస్-6 కాని రవాణా, గూడ్స్ వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించడాన్ని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) నిషేధించిన విషయం తెలిసిందే.. ఈ చర్యలతో దేశ రాజధానిలో గాలి నాణ్యత కొంతైనా మెరుగుపడుతుందని భావిస్తున్నారు.
