ePaper
More
    Homeఅంతర్జాతీయంMinistry of External Affairs | ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు.. ట్రంప్​కు విదేశాంగ శాఖ...

    Ministry of External Affairs | ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు.. ట్రంప్​కు విదేశాంగ శాఖ కౌంటర్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Ministry of External Affairs | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ US President trump వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. ఆపరేషన్ సిందూర్ operation sindoor​ అనంతర పరిణామాల సమయంలో అమెరికా, భారత్ మధ్య ట్రేడ్ గురించి చర్చ జరగలేదని స్పష్టం చేసింది. పాకిస్తాన్​ నుంచి కాల్పుల విరమణ ceasefire ప్రతిపాదన రావడంతో భారత్​ అంగీకరించిందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్ jammu kashmir అంశంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని పేర్కొంది.

    పహల్​గామ్​లో ఉగ్రదాడి pahalgam terror attack కి ప్రతీకారంగా భారత్​ ఆపరేషన్​ సిందూర్​ చేపట్టిన విషయం తెలిసిందే. అనంతరం భారత్​, పాకిస్తాన్​ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. రెండు దేశాలు దాడులు, ప్రతిదాడులు చేసుకున్నాయి. ఈ క్రమంలో భారత్​, పాకిస్తాన్​ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ ‘ఎక్స్​’లో పోస్ట్​ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే భారత్​ విదేశాంగ కార్యదర్శి విక్రమ్​ మిస్రీ ఈ విషయాన్ని ప్రకటించారు.

    తాను రెండు దేశాలతో చర్చలు జరపడంతోనే కాల్పులు విరమించాయని ట్రంప్​ చెప్పారు. యుద్ధం ఆపకపోతే రెండు దేశాలతో వాణిజ్యం ఆపేస్తామని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేగాకుండా అణుయుద్ధాన్ని nuclear war ఆపానని, కాశ్మీర్​ సమస్య పరిష్కారానికి సాయం చేస్తానని ఆయన అన్నారు. తాజాగా ఆయన వ్యాఖ్యలకు భారత విదేశాంగ శాఖ కౌంటర్​ ఇచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)ను అప్పగించాలన్నదే భారత్ విధానం అని స్పష్టం చేసింది. పాక్​ ఉగ్రవాదాన్ని ఆపేవరకు సింధూ నది జలాల రద్దు అమలులో ఉంటుందని తెలిపింది.

    Ministry of External Affairs | ప్రతిపక్షాల ఆరోపణలు

    కాల్పుల విరమణపై మొదట ట్రంప్​ ట్వీట్​ చేయడంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. కశ్మీర్​ విషయాన్ని ఆయన ప్రస్తావించడాన్ని కూడా ఖండించాయి. మొదటి నుంచి భారత్​ కశ్మీర్​ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదని చెబుతోంది. ఈ క్రమంలో ట్రంప్​ వ్యాఖ్యలను ఆయా పార్టీల నేతలు ఖండించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించాలని డిమాండ్​ చేశారు. ఈ క్రమంలోనే విదేశాంగ శాఖ ప్రకటన చేయడం గమనార్హం.

    More like this

    Nepal Army | రంగంలోకి దిగిన నేపాల్ సైన్యం.. ఆందోళ‌న‌లు విర‌మించాల‌ని పిలుపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Army | ర‌ణ‌రంగంగా మారిన నేపాల్‌లో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం రంగంలోకి...

    CM Revanth Reddy | రాజ్​నాథ్​సింగ్​ను కలిసిన సీఎం.. రక్షణ శాఖ భూములు కేటాయించాలని వినతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్​రెడ్డి బుధవారం రక్షణ...

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam...