ePaper
More
    Homeటెక్నాలజీAnti Lock Breaking System | ఇక బైక్ స్కిడ్ అవదు.. త్వరలో అన్ని బైక్...

    Anti Lock Breaking System | ఇక బైక్ స్కిడ్ అవదు.. త్వరలో అన్ని బైక్ లలో ఏబీఎస్‌ తప్పనిసరి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Anti Lock Breaking System | దేశంలో రహదారి భద్రత(Road safety)ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అన్ని బైక్‌లలో యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌(Anti lock Breaking System) అమర్చాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో 125CC లకన్నా ఎక్కువ సామర్థ్యంగల అంటే స్పోర్ట్‌ బైక్స్‌, మిడ్‌ రేంజ్‌ బైక్స్‌ వంటి మోడళ్లలో ఈ బ్రేక్‌ సిస్టమ్‌ ఉంది. ఇకపై ఇంజిన్‌ సామర్థ్యంలో సంబంధం లేకుండా అన్ని ద్విచక్ర వాహనాలకు దీనిని అమర్చాలని సూచించింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, వాహనదారుల భద్రతను పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జనవరి(January) నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది.

    Anti Lock Breaking System | ఏబీఎస్‌తో ప్రయోజనాలు..

    ప్రభుత్వాలు రహదారులను అభివృద్ధి చేస్తున్నాయి. మారుమూల పల్లెలకు సైతం బీటీ రోడ్లు వచ్చేశాయి. ఇదే సమయంలో ప్రజల ఆదాయం పెరగడంతో ప్రతి ఇంటా ఒక్క ద్విచక్ర వాహనమైనా(Two wheeler) ఉంటోంది. వాహన తయారీ కంపెనీలు మార్కెట్‌ను పెంచుకునేందుకు వివిధ రకాల ప్రజల అవసరాలకు తగ్గట్లుగా వాహనాలను తయారు చేస్తున్నాయి. రహదారులు బాగుండడంతో వాహనదారులు సైతం వేగంగా వాహనాలను నడుపుతున్నారు. నిర్లక్ష్యం, అజాగ్రత్త తదితర కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే రోడ్లు సరిగా లేకపోయినా, ట్రాఫిక్‌(Traffic) ఎక్కువగా ఉన్నా, రోడ్లు తడిగా ఉన్నా సడెన్‌గా బ్రేక్‌ వేయలేక ప్రమాదాల బారినపడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడున్న 125 సీసీ లోపు బైక్‌లలో ఏబీఎస్‌(ABS) ఫీచర్‌ లేదు. దీంతో సడెన్‌గా బ్రేక్‌ వేసినప్పుడు బైక్‌ చక్రాలు జామ్‌ అయ్యి స్కిడ్‌ అయ్యే అవకాశాలున్నాయి. ఏబీఎస్‌ అనేది వాహనాలలో ఆధునిక కీలకమైన భద్రతా వ్యవస్థ. సడన్‌గా బ్రేక్‌ వేసిన సమయంలో చక్రాలు లాక్‌ కాకుండా ఈ వ్యవస్థ నిరోధిస్తుంది. ఈ సిస్టమ్‌ బైక్‌ స్కిడ్‌ కాకుండా చూస్తుంది. తడిగా ఉండే రోడ్లపైన అత్యవసర పరిస్థితుల్లోనూ వాహనం స్కిడ్‌ కాకుండా సురక్షితంగా ఆగుతుంది. దీనివల్ల వాహనం నడిపే వ్యక్తికి ఆ వాహనం మీద నియంత్రణ ఉంటుంది. తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి.

    Anti Lock Breaking System | ఇకపై రెండు హెల్మెట్లు..

    కంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఇకపై ద్విచక్ర వాహనంతోపాటు రెండు హెల్మెట్లు(Two helmets) తప్పనిసరిగా అందించాలని వాహన తయారీ కంపెనీలను ఆదేశించింది. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ ప్రకారం రెండు హెల్మెట్లు తప్పనిసరి అని పేర్కొంది.

    Anti Lock Breaking System | వాహనాల ధరలపై ప్రభావం

    కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో రహదారి భద్రత ప్రమాణాలు పెరుగుతాయని భావిస్తున్నారు. అయితే ఏబీఎస్‌తోపాటు రెండు హెల్మెట్లు అందించాలంటే తయారీ ఖర్చు కూడా పెరగనుంది. దీంతో వాహనాల రేట్లు మూడు నుంచి ఐదు శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

    More like this

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....