అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | ఎంత ఒత్తిడి ఉన్న ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం (Arya Vysya Sangham) ఆధ్వర్యంలో ఆదివారం కన్యకా పరమేశ్వరి ఆలయంలో మెగా వైద్య శిబిరం(Health Camp) నిర్వహించారు.
ఆరోగ్యం బాగుంటేనే అన్నీ బాగుంటాయి..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరోగ్యం బాగుంటేనే జీవితంలో అన్నీ సాధించే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. నగరవాసులంతా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. వైశ్యుల్లో కూడా అనేకమంది పేదవారు ఉన్నారని, వారందరికీ ఇళ్లు ఇప్పించే బాధ్యత తనదని చెప్పారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షకార్యదర్శులు ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా, ఇల్లెందుల ప్రభాకర్ గుప్తా, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ ముక్కా దేవేందర్ గుప్తా, నాగరాజు గుప్తా, లాభిశెట్టి శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.