అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Municipal Elections | కామారెడ్డి నియోజకవర్గంలో ఎలాంటి గ్రూప్ రాజకీయాలు లేవని, మున్సిపల్ ఎన్నికల్లో (municipal elections) గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా ముందుకు వెళ్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) అన్నారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎంపీ సురేష్ షెట్కార్తో సమావేశం అయ్యారు.
Kamareddy Municipal Elections | బీఫాంల అందజేత..
ఈ సందర్భంగా కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాం పత్రాలను పీసీసీ చీఫ్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమన్వయంతోనే గెలుపు సాధ్యమని, కామారెడ్డి నియోజకవర్గంలో (Kamareddy constituency) పార్టీ కేడర్ మధ్య పూర్తి సమన్వయం ఉందన్నారు. వర్గ పోరుకు తావులేకుండా అందరూ ఏకతాటిపైకి రావడం శుభపరిణామమని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో సమన్వయమే మంత్రంగా ముందుకు సాగి అన్ని వార్డుల్లో జయకేతనం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Kamareddy Municipal Elections | జిల్లాలో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్..
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు విభేదాలు పక్కనపెట్టి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించాలన్నారు. రెబల్ అభ్యర్థులు లేకుండా చూసుకొని ముందుకు వెళ్లాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.