Sourav Ganguly | పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌లు వద్దు: సౌరవ్ గంగూలీ
Sourav Ganguly | పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌లు వద్దు: సౌరవ్ గంగూలీ

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Sourav Ganguly | పాకిస్థాన్‌తో ఎలాంటి క్రికెట్ సంబంధాలు పెట్టుకోవద్దని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ sourav Ganguly సూచించారు. పహల్గావ్ (Pahalgam) ఉగ్రదాడిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన దాదా.. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించకూడదన్నారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు(Terrorists) కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.

ఈ ఘటనలో 26 మంది అమాయక పర్యాటకులు (Tourists) ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌లో ఎలాంటి క్రికెట్ ఆడవద్దనే డిమాండ్ వ్యక్తమైంది. ఈ వాదనకు బీసీసీఐ(BCCI) మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మద్దతు ఇచ్చాడు. ఇక నుంచి పాకిస్థాన్‌తో ఎలాంటి క్రికెట్ ఆడవద్దని బీసీసీఐని కోరాడు.

‘పాక్‌(Pakistan)తో క్రికెట్ సంబంధాలు పెట్టుకోవద్దు. తక్షణమే దీనిపై నిర్ణయం తీసుకోవాలి. ఉగ్ర ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రతీ ఏడాది ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉండటం తమాషా కాదు. ఉగ్రవాదాన్ని ఏ మాత్రం సహించకూడదు.’అని గంగూలీ వ్యాఖ్యానించాడు.

దాయాదీ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో 2013 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ(ICC), ఏసీసీ(ACC) ఈవెంట్స్‌లో మాత్రమే తలపడుతున్నాయి. ఇప్పుడు ఆ టోర్నీల్లో కూడా పాక్‌తో భారత్ ఆడవద్దని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.