Homeజిల్లాలునిజామాబాద్​Mahesh Kumar Goud | బీసీ రిజర్వేషన్లలో రాజీ పడే ప్రసక్తే లేదు: పీసీసీ చీఫ్​

Mahesh Kumar Goud | బీసీ రిజర్వేషన్లలో రాజీ పడే ప్రసక్తే లేదు: పీసీసీ చీఫ్​

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళతామని పీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ స్పష్టం చేశారు. రిజర్వేషన్ల అంశం రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ​: Mahesh Kumar Goud | బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్​ గౌడ్​ (PCC President Mahesh Kumar Goud) అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కట్టుబడి అమలు చేస్తామని స్పష్టం చేశారు.

నిజామాబాద్​ జిల్లా (Nizamabad district) కేంద్రంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జీవ్​ నెం 9పై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లి అప్పీల్ చేసే యోచనలో ఉన్నామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లను (BC reservations) అడ్డుకోవడంలో ప్రధాన ముద్దాయి బీజేపీని విమర్శించారు. కుల సర్వే చారిత్రాత్మక నిర్ణయమన్నారు. సర్వేను పారదర్శకంగా నిర్వహించామని పేర్కొన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ (BJP and BRS) కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. రెండు పార్టీలు కలిసి బీసీల నోటి కాడ ముద్దను లాగే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. మూడు చట్టాలు, ఒక ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. ఢిల్లీ బీసీ రిజర్వేషన్ ధర్నాకు (Delhi BC reservation dharna) బీజేపీ నేతలు ఎందుకు మొఖం చాటేశారని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నాయన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు.

Mahesh Kumar Goud | చుక్క నీటిని వదులుకునే ప్రసక్తే లేదు

బనక చర్ల (Banaka Charla) విషయంలో ఒక చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని మహేశ్​ కుమార్​ గౌడ్​ అన్నారు. ప్రాజెక్టుల విషయంలో మంత్రి హరీశ్​ రావు మైల కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారని.. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బనక చర్ల జీవోలు వెలువడ్డాయని వివరించారు. రాయలసీమను రత్నాల సీమను చేస్తానన్నది కేసీఆర్​ కాదా? జీవోలపై ఆంధ్రా హక్కులను కాపాడతానన్నారని గుర్తు చేశారు. జగన్‌తో చెట్టాపట్టాలు వేసుకుని విందులు, వినోదాలు చేసుకున్నారని.. కానీ ప్రజల హక్కుల విషయంలో మాత్రం మౌనం వహించారని వ్యాఖ్యానించారు.

Mahesh Kumar Goud | జిల్లా అభివృద్ధి పార్టీలకతీతంగా కృషి

నిజామాబాద్​ జిల్లా అభివృద్ధికి పాలకతీతంగా కృషి చేస్తానని పీసీసీ చీఫ్​ అన్నారు. హైదరాబాద్ నుంచి ముంబై వయా నిజామాబాద్ రైల్వే లైన్​ (Nizamabad railway line) విషయమై సీఎంతో చర్చించా నని తెలిపారు. కాగా.. కామారెడ్డి బీసీ సభ తప్పకుండా నిర్వహిస్తామని చెప్పారు.