అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది. పొరుగు దేశం నుంచి ఎలాంటి కవ్వింపులు, కాల్పులు జరగలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.
“పూంచ్ ప్రాంతం (Poonch region) లో కాల్పుల విరమణ ceasefire ఉల్లంఘనకు సంబంధించి కొన్ని మీడియా, సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. నియంత్రణ రేఖ (Line of Control) వెంబడి ఎలాంటి కాల్పుల విరమణ ఉల్లంఘన జరగలేదు. దయచేసి ఆధారాలు లేని వాటిని వ్యాప్తి చేయొద్దు” అని కోరింది.