ePaper
More
    HomeజాతీయంTamil Hero Vijay | పొత్తులు లేవు.. నేనే సీఎం అభ్యర్థి : హీరో విజయ్​

    Tamil Hero Vijay | పొత్తులు లేవు.. నేనే సీఎం అభ్యర్థి : హీరో విజయ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Hero Vijay | తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు పోరు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడంతో అన్నాడీఎంకే పార్టీ (DMK Party)తో పొత్తు పెట్టుకుంది. మరోవైపు అధికార డీఎంకే సైతం కాంగ్రెస్​ కూటమిలో కొనసాగుతోంది. ఈ సారి ఎన్నికల రంగంలో తొలిసారి అడుగుపెడుతున్న తమిళ హీరో, దళపతి విజయ్(Tamil Hero Vijay)​ కూడా పొత్తు పెట్టుకుంటారనే చర్చ జరిగింది. తాజాగా ఎలాంటి పొత్తులు లేవని ఆయన స్పష్టం చేశారు.

    టీవీకే పార్టీ కార్యవర్గ సమావేశం శుక్రవారం చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగాలని తీర్మానం చేశారు. అంతేగాకుంగా సీఎం అభ్యర్థిగా విజయ్​ను ప్రకటించారు. దీంతో ఎన్డీఏ కూటమి, డీఎంకేతో పొత్తు వార్తలకు విజయ్‌ చెక్ పెట్టారు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ డీఎంకే, బీజేపీ(BJP)లతో పొత్తు పెట్టుకోమని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామన్నారు.

    Tamil Hero Vijay | వచ్చే నెలలో భారీ సదస్సు

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు (Tamil Nadu Assembly Elections) 2026 ఏప్రిల్​, మే నెలల్లో జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో వచ్చే నెలలో తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ పెద్ద సదస్సు నిర్వహించాలని నిర్ణయించింది. సెప్టెంబర్​ నుంచి పూర్తిస్థాయి ప్రచారం చేపడతామని టీవీకే అధినేత విజయ్​ ప్రకటించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి గ్రామాల్లో బహిరంగ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

    Tamil Hero Vijay | ‘టీవీకే’ హిట్​ అవుతుందా..

    తమిళనాడు రాజకీయాల్లో సినిమ నటులు రావడం కొత్త కాదు. గతంలో ఎంజీఆర్​ ఏఐడీఎంకే పార్టీని ఏర్పాటు చేసి సీఎం అయ్యారు. అనంతరం సినీనటి జయలలిత సైతం అదే పార్టీ నుంచి రాజకీయాల్లో రాణించారు. అయితే అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన విజయ్​కాంత్ దేశీయ మర్పోక్కు ద్రావిడ కజగం అనే పార్టీ పెట్టారు. తొలుత ఆ పార్టీ మంచి సీట్లు సాధించిన తర్వాత ప్రభావం కోల్పోయింది. మరో తమిళ నటుడు కమల్​ హాసన్​ మక్కల్​ నీధి మయ్యం పార్టీని ఏర్పాటు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన డీఎంకేకు మద్దతు తెలిపారు. తాజాగా ఆయన డీఎంకే తరఫున రాజ్యసభ(Rajya Sabha)కు ఎంపికయ్యారు. అయితే ఆయన పార్టీ సక్సెస్​ కాలేదు. మరి హీరో విజయ్​ పార్టీ టీవీకే సూపర్​ హిట్​ అవుతుందా లేదా అనేది చూడాలి.

    More like this

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...

    YS Jagan | చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డ జగన్​.. ప్రభుత్వం ఉందా అని ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandra Babu)...

    India-Pakistan | మ‌రో నాలుగు రోజుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ఇంకా అమ్ముడుపోని టిక్కెట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-Pakistan | అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో హై వోల్టేజ్‌గా పేరొందిన భారత్ vs పాకిస్తాన్...