అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Medical Colleges | రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్(NMC) అనుమతి ఇచ్చింది. తెలంగాణవ్యాప్తంగా మొత్తం 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు (Medical Colleges) ఉన్నాయి. అయితే ఇటీవల తనిఖీలు చేపట్టిన ఎన్‌ఎంసీ అన్ని కాలేజీలకు ఎలాంటి ఫైన్ విధించకుండానే కొనసాగించుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో 4,090 ఎంబీబీఎస్ సీట్లు(4,090 MBBS Seats) అందుబాటులో ఉండనున్నాయి.
Medical Colleges | ఆ సమస్య పరిష్కరించాలి
ప్రభుత్వం ఇటీవల అన్ని మెడికల్ కాలేజీలకు ప్రిన్సిపాల్స్‌ను నియమించింది. అంతేగాకుండా ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పించింది. దీంతో మెడికల్ కాలేజీల్లో సిబ్బంది కొరత తీరింది. అయితే మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న పలు ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య తక్కువగా ఉన్నట్లు ఎన్‌ఎంసీ గుర్తించింది. నాలుగు నెలల్లో ఆ సమస్య పరిష్కరించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. దీంతో ప్రభుత్వం బెడ్ల సంఖ్య పెంపునకు చర్యలు చేపట్టింది.
Medical Colleges | భారీగా కొత్త కాలేజీలు
రాష్ట్రంలో కొత్తగా భారీగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు అయ్యాయి. 2022 నుంచి 2024 మధ్య 25 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం గమనార్హం. అన్ని కాలేజీలకు పర్మిషన్లు యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఎన్‌ఎంసీ (NMC)పేర్కొంది. దీంతో అన్ని సీట్లను భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల ప్రభుత్వం 44 మంది సీనియర్ ప్రొఫెసర్లకు ప్రమోషన్ ఇచ్చి మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌గా, టీచింగ్ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లుగా నియమించింది. అలాగే పలువురు అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లకు కూడా పదోన్నతి కల్పించింది. మరోవైపు 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల (607 Assistant Professor Posts) భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. మరో 714 పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆర్థిక శాఖ (Finance Department) ఆమోదం తెలిపింది. దీంతో మెడికల్ కాలేజీల్లో బోధన సిబ్బంది కొరత తీరనుంది.
Medical Colleges | త్వరలో కౌన్సెలింగ్
దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలు గతంలోనే వెలువడ్డాయి. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ(Kaloji Health University) ఆధ్వర్యంలో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నారు. నీట్ స్టేట్ ర్యాంకులను విడుదల చేసి, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.