అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. ఎగువభాగం నుంచి ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టడంతో శనివారం ఉదయం నీటి విడుదలను నిలిపివేసినట్లు నీటిపారుదల శాఖ ఈఈ సోలోమాన్ తెలిపారు.
ఎగువ భాగం నుంచి ప్రాజెక్టులోకి 13,590 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ప్రధాన కాలువ ద్వారా 1,800 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ఆయకట్టుకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 1405.00 అడుగులకు (17.80 టీఎంసీలు) గాను 1404.00 అడుగుల (16.357 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది.
Nizamsagar Project | పర్యాటకుల సందడి
ప్రాజెక్టుపై పర్యాటకుల సందడి నెలకొంది. ఎగువ నుంచి భారీ ఎత్తున ఇన్ఫ్లో ఉండడంతో రెండురోజుల క్రితం వరకు గేట్లను ఎత్తి మంజీరలోకి (manjeera) నీటిని విడుదల చేశారు. దీంతో ప్రాజెక్టును సందర్శించేందుకు పర్యాటకులు తరలివచ్చారు. అక్కడి ఉద్యానవనంలో సేదదీరారు. గేట్లు మూసి ఉంచినప్పటికీ పర్యాటలకు ప్రాజెక్టును తిలకించేందుకు వస్తున్నారు.