అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar reservoir flood : కామారెడ్డి (KamareddY) జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి భారీ ఇన్ఫ్లో వస్తోంది. జలాశయం వియర్ నెంబర్ 12 – వియర్ నెంబర్ 16 వరద గేట్లలో కొన్నింటి ద్వారా దిగువ మంజీరా(Manjira) నది (River)లోకి గత మూడు రోజులుగా నీటిని విడుదల చేస్తూ వచ్చారు.
వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో నిజాంసాగర్(Nizamsagar) గేట్లను దించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, పదో నంబరు వరద గేటు మొరాయిస్తోంది. దీంతో నీటి ప్రవాహం కిందికి పోతూనే ఉంది.
ఈ వరద గేటును కిందికి దించేందుకు సిబ్బంది, అధికారులు గురువారం (ఆగస్టు 21) ఉదయం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నా.. ఫలితం లేకుండా పోయింది.
అయినా గేట్లను దించేందుకు రాత్రి కూడా ట్రై చేస్తూనే ఉన్నారు.

Nizamsagar reservoir flood : రోజంతా ట్రై చేసినా..
వియర్ నెంబర్ 16 వరద గేట్లను పూర్తిగా నిలిపివేసి, 12 వరద గేట్ల ద్వారా నీటి విడుదలను కొనసాగిస్తే.. అచ్చంపేట, ఆరేపల్లి, లింగంపల్లి, మర్పల్లి గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందులు ఉండవు. నాగమడుగు(Nagamadugu)లోనూ వంతెన వద్ద ఎలాంటి సమస్య ఉండదు.
కానీ, పదో నెంబర్ గేటు మొరాయిస్తుండటంతో ఆందోళన నెలకొంది. దానిని కిందికి దించేందుకు అధికారులు ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
తూతూమంత్రంగా పనులు..
ఇటీవలే వరద గేట్లకు గ్రీసింగ్, ఆయిల్ పనులు చేసినప్పటికీ మళ్లీ యథావిధిగా వరద గేట్లు మొరాయిస్తున్నాయి. దీనిని బట్టి తూతూ మంత్రంగానే పనులు చేపట్టినట్లు తెలుస్తోంది.
మొత్తానికి పైపైనే చేపట్టిన పనుల వల్ల అటు ప్రజా ధనంతోపాటు, జలాశయంలో నిల్వ చేయాల్సిన నీరు కూడా వృథా కావడంపై ఆందోళన నెలకొంది.