ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ భూములను రక్షించాలని ధర్నా

    Nizamsagar | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ భూములను రక్షించాలని ధర్నా

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్​: Nizamsagar | నిజాంసాగర్ ప్రాజెక్ట్​ భూములను కాపాడాలని కోరుతూ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. మంగళవారం కాంగ్రెస్​ పార్టీ(Congress Party) ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు ధర్నా చేశారు.

    అనంతరం ర్యాలీగా వెళ్లి తహశీల్దార్​కు భిక్షపతి(Tahsildar Bikshapathi)కి వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్ట్​ భూములను ఇతర నియోజకవర్గాలకు కేటాయించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ప్రాజెక్ట్​కు సంబంధించి అచ్చంపేట శివారులో 680 ఎకరాల భూమి ఉందని.. అందులో ప్రస్తుతం జవహర్​ నవోదయ, తెలంగాణ మోడల్​ స్కూల్​, పల్లె ప్రకృతి వనం, నర్సరీలు ఉన్నాయన్నారు.

    మిగిలి ఉన్న భూమిని సైతం జుక్కల్​ నియోజకవర్గ అభివృద్ధికి మాత్రమే కేటాయించాలని నాయకులు డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో పిట్లం మార్కెట్​ కమిటీ ఛైర్మన్​ మనోజ్​ కుమార్​, నిజాంసాగర్, మహమ్మద్​నగర్​ మండలాల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ దుర్గారెడ్డితో పాటు కాంగ్రెస్​, బీఆర్ఎస్ నాయకులు, సొసైటీ ఛైర్మన్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

    More like this

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్...