ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar Project | రేపు నిజాంసాగర్​ గేట్లు ఎత్తే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

    Nizamsagar Project | రేపు నిజాంసాగర్​ గేట్లు ఎత్తే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. 50వేల క్యూసెక్కులకు పైగా ఇన్​ఫ్లో ప్రాజెక్టులోకి వస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో ఉండడంతో అధికారులు మంజీర పరీవాహక ప్రాంతంలో ఉండే ప్రజలను అలర్ట్ చేస్తున్నారు.

    Nizamsagar Project | ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం..

    రాబోయే 24 గంటల్లో నిజాంసాగర్​ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని.. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయని తహశీల్దార్​ భిక్షపతి (Tahsildar Bikshapathi), నీటిపారుదల శాఖ (Irrigation Department) ఏఈలు అక్షయ్ కుమార్, సాకేత్​లు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ప్రాజెక్టుకు వస్తున్న ఇన్​ఫ్లో చూసిన అనంతరం వారు వివరాలు వెల్లడించారు.

    Nizamsagar Project | జాలర్లు, గొర్రెల కాపర్లకు అలర్ట్​..

    ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున మంజీర (manjeera) పరీవాహక ప్రాంతంలో చేపలు పట్టేవాళ్లు, గొర్రెల కాపర్లు అలర్ట్​గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నీటి ఉధృతి ఉంటుంది. కావున పరీవాహక ప్రాంతాలవైపు వెళ్లవద్దని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.8 టీఎంసీలకు గాను 10.79 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సింగూరుకు భారీగా వరద నీరు వస్తుండడంతో నిజాంసాగర్​ నీటిమట్టం వేగంగా పెరుగుతోంది.

    Latest articles

    Congress | రాజగోపాల్​రెడ్డిపై చర్యలు తీసుకుంటాం.. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్​ మల్లు రవి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | పీసీసీ క్రమశిక్షణ కమిటీ (Disciplinary Committee) ఆదివారం పలు అంశాలపై సుదీర్ఘంగా...

    Nizamabad | భారతీయ గ్రామీణ కర్మచారి నూతన కార్యవర్గం

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | భారతీయ గ్రామీణ కర్మాచారి సంఘ్ (Indian Rural Workers' Association) నూతన కార్యవర్గాన్ని...

    jukkal | జుక్కల్​కు మంత్రులు సీతక్క, జూపల్లి రాక

    అక్షరటుడే నిజాంసాగర్: jukkal | జుక్కల్ నియోజకవర్గానికి (Jukkal constituency) ఈనెల 20వ తేదీన మంత్రులు సీతక్క (Minister...

    Ball badminton | రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్​లో సత్తా చాటాలి

    అక్షరటుడే, ఇందూరు: Ball badminton | రాష్ట్రస్థాయి బాల్​ బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలని జిల్లా...

    More like this