అక్షరటుడే, ఎల్లారెడ్డి: Nizam Sagar | నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. సింగూరు గేట్లు ఎత్తడం, పోచారం ప్రాజెక్ట్ (Pocharam project) పొంగి పొర్లుతుండటంతో జలాశయంలోకి భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది.
ప్రాజెక్ట్‌లోకి ప్రస్తుతం 59,721 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో (Inflow) వస్తోంది. వరద గేట్ల ద్వారా 61,038 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువకు (main canal) వెయ్యి క్యూసెక్కులు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1405 (17.802 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1404.6 (17.325 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది.
Nizam Sagar | పొంగిపొర్లుతున్న పోచారం
నాగిరెడ్డిపేట మండలంలోని (Nagireddypet mandal) పోచారం ప్రాజెక్ట్‌కు గుండారం వాగు, లింగంపేట పెద్దవాగు, గాంధారి పాములవాగు ద్వారా భారీ వరద వస్తోంది. డ్యామ్‌లోకి 3,466 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. అంతేమొత్తం డ్యామ్‌పై నుంచి పొంగి మంజీరలో కలుస్తోంది. జలాశయంలోకి ఈ ఏడాది మొత్తం 23.37 టీఎంసీల వరద నీరు రాగా.. 21.38 టీఎంసీలు మంజీరలోకి వెళ్లింది.
Nizam Sagar | పర్యాటకుల తాకిడి
నిజాంసాగర్ గేట్లు ఎత్తడం, పోచారం పొంగిపొర్లుతుండటంతో జల సవ్వడులు చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. పర్యాటకులు భారీగా వచ్చి ప్రాజెక్ట్‌ల అందాలను తిలకిస్తున్నారు. అక్కడే భోజనాలు చేసి కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నారు. పోలీసులు నీటి సమీపంలోకి పర్యాటకులు వెళ్లకుండా చర్యలు చేపట్టారు.